Advertisement

Advertisement


Home > Movies - Interviews

మంచి కథ కోసం మనమంతా - చంద్రశేఖర్ యేలేటి

మంచి కథ కోసం మనమంతా - చంద్రశేఖర్ యేలేటి

అన్ని సినిమాలు ఒకేలా వుండవు..అవును..చంద్రశేఖర్ యేలేటి సినిమాలు కాస్త డిఫరెంట్ గానే వుంటాయి. డిఫరెంట్ గా వుంటాయి అనే కన్నా, డిఫరెంట్ సబ్జెక్ట్ లే తీసుకుని చేస్తారు అని అనడం ఇంకా సరిగ్గా వుంటుంది. ఐతే, అనుకోకుండా ఒక రోజు, ప్రయాణం, సాహసం ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి పొంతనలేని సబ్జెక్ట్ లే. ఇంకా చెప్పాలంటే అవి తీసేనాటికి మిగిలిన వారికి తట్టని సబ్జెక్ట్ లే. అలాంటి వైవిధ్యమైన డైరక్టర్ చంద్రశేఖర్ తొలిసారి ఓ ఫ్యామిలీ డ్రామాను సబ్జెక్ట్ గా ఎంచుకున్నారు. మనమంతా. తొలిసారి మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ తెలుగుతెరపై ఫుల్ లెంగ్త్ పాత్ర పోషిస్తున్న సినిమా. చాలా కాలం తరువాత అలనాటి హీరోయిన్ గౌతమి తెలుగు తెరపై కనిపిస్తున్న సినిమా. ఈ నేపథ్యంలో చంద్రశేఖర్ యేలేటితో ముఖాముఖి.

ఇంతవరకు చేయని జోనర్ చేయాలనా? లేక ఫ్యామిలీ జోనర్ లో సినిమా చేయాలనా? మనమంతా ఎలా స్టార్ట్ అయింది?

చేయని జోనర్ లోనే సినిమాలు చేయాలని ఏమీ అనుకోలేదు. అనుకోవడం లేదు. నాలో ఎప్పుడూ ఒకటి రెండు లైన్లు డిస్కషన్ లో నడుస్తూనే వుంటాయి. వాటిలో ఏది పూర్తయితే, దాన్ని సినిమాగా మారుస్తాను. ఈసారి మనమంతా అలా సెట్ అయింది అంతే.

ఇంతవరకు మీరు తీసిన సినిమాలు అన్నింటిలో ఏదో ఒక రేసింగ్ ఎలిమెంట్ వుంటుంది. ప్రేక్షకుడిని సినిమా తనతో తీసుకెళ్లేలాంటి సబ్జెక్ట్ లే చేసారు. మరి ఈ సినిమా సంగతేమిటి? ఇందులో కూడా అలాంటి వ్యవహారాలుంటాయా?

లేదండీ. ఫస్ట్ టైమ్ అండీ. ఇందులోని నాలుకు కథల్లో ఓ దాంట్లో టెన్షన్ ఎలిమెంట్ వుంటుంది కానీ, థ్రిల్లర్ గా డీల్ చేయలేదు. ఎమోషనల్ డ్రామాగా డీల్ చేసాను. ఫస్ట్ టైమ్ అండీ నాకు. హ్యూమన్ ఎమోషన్ డ్రామా డీల్ చేయడం?

ఏమిటి నమ్మకం ప్రేక్షకుల మీద?

ఇందులోని ఎమోషనల్ డ్రామాకు కనెక్ట్ అవుతారనే నమ్మకం. అది ఈ సినిమానే కాదు, ఎమోషనల్ గా మనం కనెక్ట్ చేయించగలిగితే ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం. ఆ నమ్మకంతోనే ఈ సినిమా చేసాను. అది గుడ్డినమ్మకం అనుకోండి మరేమన్నా అనుకోండి.

నిజానికి ప్రేక్షకుడిని ఇవ్వాళ రెండు గంటలు థియేటర్లో కూర్చోపెట్టాలి అంటే నానా పిల్లి మొగ్గలు వేయాల్సి వస్తోంది? ఎమోషనల్ సినిమాల్లో కూడా ఫన్ పండించాల్సి వస్తోంది. మరి మీరేం చేసారు ఈ సినిమాలో?

ఈ సినిమాలో అన్నీ వున్నాయండీ. హ్యాపీ నెస్, శాడ్ నెస్ అన్నీ వున్నాయి. గౌతమి-ఊర్వశి గార్ల క్యారెక్టర్లు బాగా ఎంజాయ్ చేస్తారు. పాప క్యారెక్టర్ కు కూడా బాగా కనెక్ట్ అవుతారు. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా జోవియల్ గానే సాగుతుంది. సెకండాఫ్ మాత్రమే ఎమోషనల్ గా ప్రేక్షకుడిని కట్టేస్తుంది.

కథ అనుకున్నపుడే మోహన్ లాల్ అనుకున్నారా?

అవును, ఆయన ఓకె అంటే కనుక మళయాలంలో కూడా చేద్దాం అని కూడా అనుకున్నాం. లక్కీగా ఓకె అన్నారు.

మీ సినిమాలు చూసుకుంటే, మీకు పేరు తెచ్చిన రేంజ్ లో, నిర్మాతలకు పైసలు తెచ్చాయంటారా?

లేదండీ..అలా అని లాస్ వెంచర్లు కూడా కాదు. మీరు అన్నది నిజం. పేరు తెచ్చినంతగా డబ్బులు తేలేకపోవచ్చు. కానీ సాహసంతో సహా ఏదీ లూజింగ్ వెంచర్లు మాత్రం కాదు. అందువల్ల మళ్లీ మళ్లీ సినిమాలు వస్తున్నాయి. లేదంటే ఇండస్ట్రీ కట్ థ్రోట్ గా పక్కన పెట్టేస్తుంది.

మరి గత అనుభవంతో ఈ సినిమాకు ఏమన్నా జాగ్రత్తలు తీసుకున్నారా? 

మాగ్జిమమ్ కేర్ తీసుకున్నా.

మీరు ఐతే, అనుకోకుండా ఒకరోజు సినిమాలు తీసి చాలా కాలం అయింది. అయితే ఇప్పుడు ఆ తరహా సినిమాలు జోరందుకున్నాయి. కానీ చేసింది చూడకూడదనో, వేరే జోనర్లో చేద్దామనో ఇటు వచ్చారా?

అదేం కాదండీ. ఆ టైమ్ కు నాకు ఏ కథ ఇంట్రెస్ట్ గా స్ట్రయిక్ అవుతుందో అది చేస్తాను అంతే.

కానీ సహజంగా సేలబుల్ సబ్జెక్ట్, కాంటెంపరరీ ఆడియన్స్ పల్స్ బట్టి వెళ్లాలేమో?

అదే పొరపాటు. సేలబుల్ అనే సబ్జెక్ట్ కోసం వెదకడం ప్రారంభిస్తే అక్కడే రాంగ్ స్టెప్ తీసుకుంటాం. మనం ఒకటే ఆలోచించాలి. రెండు గంటలు ఇంట్రస్టింగ్ గా కథ చెప్పాలి. ప్రేక్షకులు కనెక్ట్ అయితే ఓకె. లేదంటే లేదు. అలా కాకుండా వాళ్లు దేనికి కనెక్ట్ అవుతారు అన్నది వెదకడం మొదలు పెడితే రెండికి చెడతాం?

మోహన్ లాల్ కు బదులుగా మన దగ్గర సూటయ్యే హీరోలు లేరంటారా?

లేరని కాదండీ. కానీ ఇక్కడ కొన్ని పరిమితులు వుంటాయి. హీరోల ఇమేజ్ లు అవీ వుంటాయి. అందువల్ల వాళ్ల సమస్యను కూడా ఆలోచించాలి మనం.

మోహన్ లాల్, గౌతమి చేరడంతో ఇది ఖర్చు విషయంలో భారీ సినిమాగా మారిపోయిందేమో?

కావచ్చు, కానీ మలయాళం, తమిళ్ మార్కెట్ పెరుగుతుంది కదా?

ఇంతకీ మనమంతా సినిమాకు జనం ఎందుకురావాలని చెబుతారు మీరు?

మంచి కథ. మంచి మానవ సంబంధాలు, కాస్త ఎంటర్ టైన్ మెంట్, ఇలా అన్నీ కలిసిన సినిమా. అందుకే వచ్చి చూడాలి.

మళ్లీ మీ దగ్గర నుంచి మాంచి థ్రిల్లర్ ఎప్పుడు వస్తుంది.?

రెండు కథలు జరుగుతున్నాయి. అందులో ఒకటి యాక్షన్ సినిమా. రెండవది లవ్ స్టోరీ.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?