Advertisement

Advertisement


Home > Movies - Interviews

నాకు బాస్ చైర్లో కూర్చోవడం ఇష్టం-నీహారిక

నాకు బాస్ చైర్లో కూర్చోవడం ఇష్టం-నీహారిక

కొత్త హీరోయిన్ వస్తోంది స్క్రీన్ మీదకు అంటే పెద్దగా ఇంట్రెస్ట్ ఏమీ వుండదు..ప్రేక్షకులకు. ఎందుకంటే మన టాలీవుడ్ హీరోస్వామ్య వ్యవహారం కాబట్టి. కానీ ఒకమనసు సినిమా వైనం అలాంటిది కాదు.. ఇప్పుడు ఫోకస్ అంతా హీరోయిన్ పైనే.. కొణిదెల నీహారిక.. ఆ పేరే చెబుతుంది ఎందుకంత ఫోకస్ అన్నది. కోట్లాది అభిమానులను సంపాదించుకున్న ఫ్యామిలీ నుంచి వస్తున్న హీరోయిన్ కదా.. అందుకే ఆ క్రేజ్ అని. పైగా ఇక్కడ ఇంకో గమ్మత్తు వుంది. కొణిదెల నీహారిక ఇప్పటికే కనీసం కొంత మంది ప్రేక్షకులకయినా పరిచయం.. ఏంకర్ గా, ప్రెజెంటర్ గా, వెబ్ సీరీస్ ఏక్టర్ గా.. అందుకే అలా పరిచయం అయిపోయిన అమ్మాయి హీరోయిన్ గా ఎలా వుంటుంది? ఎలా చేస్తుంది? అన్నదే ఆసక్తి. మధురాశ్రీధర్ నిర్మాణంలో రామరాజు డైరక్షన్ లో నీహారిక నటించిన ఒక మనసు సినిమా విడుదల మరి కొన్ని రోజుల్లోనే. ఈ నేఫథ్యంలో ఆమెతో గ్రేట్ ఆంధ్ర ఇంటర్వూ..

హాయ్ నీహారిక..

హాయ్ అండీ

టెన్షన్ ఏమేరకు పెరిగింది.. విడుదల దగ్గరకు వచ్చేసిందిగా.?

ఆ... టెన్షన్ నాకు లేదు.. మా ఇంట్లో వాళ్లకి వుంది. నాకు మాత్రం ఎలా వుంటుందా అన్న ఆసక్తి వుంది. అది కూడా నేను షూటింగ్ లో పాల్గొన్నాను. డబ్బింగ్ లో రష్ చూసాను. ఫైనల్ ప్రొడక్ట్ ఎలా వుంటుందనే ఆసక్తి...అంతే..అంతకన్నా ఏమీ లేదు.

ఫైనల్ ప్రొడక్ట్ ఇంత వరకు చూడలేదా?

లేదండీ.. చూడలేదు..

డాడీ చూసారా?

లేదు.. ఆయనా చూడలేదు. రష్ చూస్తారా డాడీ అని అడిగాను. లేదమ్మా.. ఫైనల్ ప్రొడక్ట్ ఒకేసారి అందరితో కలిసి చూస్తా అన్నారు.?

సాధారణంగా పెద్ద ఫ్యామిలీ నుంచీ, సినిమా నేపథ్యం నుంచి వస్తున్నారు కదా.. మరి మీ డాడీ సినిమా ఎలా వచ్చిందో..అవసరమైతే సలహాలు సూచనలు అవీ ఇచ్చే కార్యక్రమం వుంటుంది కదా?

లేదండీ..ఏక్ట్యువల్ గా డాడీకి లవ్ స్టోరీలు పెద్దగా నచ్చవు. అది కూడా ఓ రీజన్.

అవునా.. మరి ఈ కథ ఎలా ఒకె చేసారు.?

రామరాజు గారు కథ మూడున్నర గంటలు నెరేట్ చేసారు. వెరీ లాంగ్ నెరేషన్. డాడీ వింటా అని చెప్పి గంటన్నరే విని, నా డెసిషన్ కు వదిలేసి వెళ్లిపోయారు. నాకు సంథ్య క్యారెక్టర్ బాగా నచ్చేసింది. ఇంకా చెప్పాలంటే రెండు రోజులు నాతోనే ట్రావెల్ చేసింది. అందుకే వెంటనే మరేం ఆలోచించకుండా ఓకె చేసేసాను.

సాధారణంగా ఇంత పెద్ద ఫ్యామిలీ నుంచి రావాలనుకున్నపుడు ట్రాక్ రికార్డ్ వున్న డైరక్టర్, సినిమా రేంజ్ అన్నీ చూసుకుంటారు కదా..?

నాకు అదేం లేదండీ..నేను సినిమాల్లో చేస్తానేమో అన్న టాక్ వచ్చిన తరువాత కొంత మంది కథలు చెప్పారు కానీ నాకు నచ్చలేదు. రామరాజు గారు ఈ కథను చెప్పిన విధానం, సూర్య, సంధ్య క్యారెక్టర్లు..వాటిని ఆయన ఏళ్ల తరబడి దిద్దిన పద్దతి అన్నీ నచ్చేసాయి. అందకే ఇంకేం చూడలేదు..ఆలోచించలేదు.

నీహారిక కాకపోతే, ఈ సినిమాలో సంధ్య క్యారెక్టర్ కాస్ట్యూమ్స్ ఇలాగే వుండేవా?

కచ్చితంగా ఎందుకంటే రామరాజు గారికి ఓ ఫిక్స్ డ్ అయిడియా వుంది. నాకు కూడా గ్లామర్ షో చేయాలన్న కోరిక లేదు. పైగా నాకు శారీలంటే చాలా ఇష్టం. ఇండియన్ వేర్ అంటే కూడా. అందుకే చెప్పేసా..మీరు ఏ శారీ ఇవ్వండి కట్టేసుకుంటా అని.

అమ్మాయిలు షూటింగ్ కు వెళ్లడం అంటే మమ్మీ మస్ట్..మీక్కూడానా?

అవునండీ..దానికి తగిన కారణాలు వున్నాయి. నేను చాలా కేరింగ్ ఎన్విరాన్ మెంట్ లోంచి వచ్చాను. పైగా అదీకాక ఈ సినిమాకు అమ్మే నా కాస్ట్యూమ్స్ డిజైన్ చేసింది.

మీ వయసుకు మీ మమ్మీ డిజైన్ చేయడం అంటే జనరేషన్ టేస్ట్ తేడా రాలేదా?

లేదండీ..పైగా రామరాజు గారికి కూడా పర్టిక్యులర్ టేస్ట్ వుంది.

మమ్మీ కూడా వచ్చినా రూమర్లు.. డేటింగ్ న్యూస్ లు తప్పలేదా?

హా...అది అంతా అంతేనండీ..నేను సినిమాల్లోకి వస్తా అన్నపుడే ఇంట్లో అందరూ చెప్పారు. కాంప్లిమెంట్స్, క్యాష్ ఓకె. కానీ కామెంట్లు, రూమర్లు కూడా వస్తాయి. వాటికి ప్రిపేర్ కావాలి నువ్వు అని. అందువల్ల ఇక అవేం నేను పట్టించుకోలేదు.

డిజే గా మీరు హైపర్ ఏక్టివ్..వెబ్ సీరిస్ లో కూడా ఒకె. మరి ఈ సినిమాలో?

నిజానికి నేను ఇంట్లో చాలా కామ్ గోయింగ్ అండీ. అయితే డిజె గా షో చేస్తున్నపుడు క్రౌడ్ పుల్ చేయాలి కాబట్టి కాస్త లౌడ్ గా, హైపర్ ఏక్టివ్ గా చేసాను. వెబ్ సిరీస్ ఆ క్యారెక్టర్ కు తగినట్లు. అయినా ఒకమనసులో సంధ్య మరీ సీరియస్ లేదా డల్ క్యారెక్టర్ కాదు. సూర్య పక్కన వుంటే బటర్ ఫ్లయ్ లా హుషారుగానే వుంటుంది.

రామరాజు మూడున్నర గంటలు చెప్పింది, స్క్రీన్ మీదకు బాగానే తెచ్చారని అనుకుంటున్నారా?

కచ్చితంగా అండీ. ఆయనకు ఆయన స్క్రిప్ట్ మీద ఆ కమాండ్, విజన్ రెండూ వున్నాయి.

మీకు ప్రొడక్షన్ అంటే మహా ఇష్టం అని?

అవునండీ..నాకు చాలా ఇష్టం. బాస్ చైర్లో కూర్చుని, ఆర్డర్లు పాస్ చేస్తూ, పనులు చేయించడం అంటే. పైగా మాకు ప్రొడక్షన్ హవుస్ వుంది..బోలెడు మంది హీరోలు వున్నారు. అందువల్ల ప్రొడక్షన్ చేయాలని వుంది. ఏక్టింగ్ కన్నా కూడా అదే ఇష్టం.

కానీ మీ ఫాదర్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ కాలేకపోయారు కదా?

అలా అని అనలేం. నిజానికి అలాంటి ఫెయిల్యూర్ వచ్చిన తరువాత కూడా ఆయన నిలదొక్కుకుని, ఏక్టింగ్, టీవీ ప్రొడక్షన్ అన్నీ చేస్తున్నారంటే సక్సెస్ అనే చెప్పాలి.

ఒకమనసు విడుదల దగ్గరకు వచ్చినా మరే స్క్రిప్ట్ కు ఎందుకు ఓకె చెప్పలేదు.?

మంచి స్క్రిప్ట్ వస్తే ఒకె చెబుతాను. నాకేమీ హడావుడిగా సినిమాలు చేసేయాలని, డబ్బులు సంపాదించేయాలనీ లేదు. సెలెక్టివ్ గా మంచి క్యారెక్టర్ లు చేయాలని వుంది. అంతే కాదు నేను తెలుగుకే పరిమితం కావాలని అనుకోవడం లేదు. తమిళ్, మలయాళం భాషల్లో కూడా చేయాలని అనుకుంటున్నాను.

అక్కినేని, ఘట్టమనేని వారసురాళ్లు ఒక్కో సినిమాకే పరిమితం అయ్యారు. మరి మీరు?

వాళ్ల విషయం నాకు తెలియదు. నేను మాత్రం కంటిన్యూ చేస్తాను. చేయాలన్నదే నా ఆలోచన.

మెగా ఫ్యామిలీ అంతా కలిసి మీ సినిమా చూడబోతున్నారా?

అలా అని వుంది. కానీ చరణ్ అన్న ధృవ షూట్ లో వున్నారు. చిరంజీవి డాడీ కూడా షూట్ లో వుంటారు. చూడాలి ఎవరెవరు అందుబాటులో వుంటారో..అందరం కలిసి చూడాలి.

థాంక్యూ బెస్టాఫ్ లక్

థాంక్యూ అండీ

విఎస్ఎన్ మూర్తి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?