Advertisement

Advertisement


Home > Movies - Interviews

‘స్పీడున్నోడు’ మరో కమర్షియల్ ఎంటర్ టైనర్..

‘స్పీడున్నోడు’ మరో కమర్షియల్ ఎంటర్ టైనర్..

బెల్లంకొండ శ్రీనివాస్‌...సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి. వినాయక్‌ దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్‌ సమర్పణలో  శ్రీలక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై బ్లెంకొండ గణేష్‌బాబు నిర్మించిన ‘అల్లుడుశీను’ చిత్రంతో యంగ్‌ అండ్‌ ఎనర్జిటిక్‌ హీరోగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు బెల్లంకొండ సురేష్‌ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్‌. అదరగొట్టే డాన్సు, విరగ్గొట్టే ఫైట్స్‌తోనే కాకుండా నటనలో తనదైన శైలితో మెప్పించాడు. తొలి చిత్రంతోనే సూపర్‌హిట్‌ కొట్టిన బెల్లంకొండ శ్రీనివాస్‌.. ఇప్పుడు మరోసారి తన స్పీడును తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయడానికి ‘స్పీడున్నోడు’గా వస్తున్నాడు. భీమనేని రోషితాసాయి సమర్పణలో గుడ్‌విల్‌ సినిమా బ్యానర్‌పై భీమనేని సునీత నిర్మాతగా భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. తొలి చిత్రం ‘అల్లుడుశీను’తో 40 కోట్ల క్లబ్‌లో చేరి రికార్డ్‌ క్రియేట్‌ చేసిన ఈ యంగ్‌ అండ్‌ ఎనర్జిటిక్‌ హీరో నటిస్తున్న లేటెస్ట్‌ మూవీ ‘స్పీడున్నోడు’ చిత్రంతో బిజినెస్‌ పరంగా స్పీడుగా దూసుకెళ్తున్నారు. సీడెడ్‌లో 3 కోట్ల 51 క్ష బిజినెస్‌ను పూర్తి చేసుకుని టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా నిలిచారు. తన రెండో చిత్రంతో మరో సూపర్‌హిట్‌ కొట్టేందుకు రెడీ అవుతున్నారు ఈ యంగ్‌ హీరో. ఈ చిత్రం తర్వాత వచ్చే ఏడాది ఏప్రిల్‌లో మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి శీను దర్శకత్వంలో ఓ మాస్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ చేయబోతున్న యంగ్‌ అండ్‌ ఎనర్జిటిక్‌ హీరో బ్లెంకొండ శ్రీనివాస్‌ బర్త్‌డే జనవరి 3. ఈ సందర్భంగా బ్లెంకొండ శ్రీనివాస్‌తో ఇంటర్వ్యూ....

బర్త్ డే స్పెషల్ ఏం లేదు....

ఈ పుట్టినరోజుకు పెద్దగా కొత్త ఆలోచనలేమీ లేదు. ఫ్రెండ్స్‌తో ఎంజాయ్‌ చేస్తాను. బయట ఎక్కడా వెళ్ళడం లేదు.

అది డైరెక్టర్ గారి చాయిస్....

-డైరెక్టర్ గారికి ఎస్ సెంటిమెంటో ఏమో కానీ డైరెక్టర్ గారి చాయిస్ మీదనే టైటిల్ పెట్టాం. ‘స్పీడున్నోడు’ ఒక ఫ్రెండ్‌ఫిప్‌ గురించి, ప్రేమ గురించి, ఫ్యామిలీ వాల్యూస్‌ గురించి తెలియజేప్పే చిత్రం.

చాలా చేంజస్ చేశాం....

`తమిళ సినిమా ‘సుందర పాండ్యన్‌’ సినిమా మెయిన్‌ ప్లాట్‌ బాగా  తీసుకున్నామంతే. తెలుగు క్లయిమాక్స్ మినహా అన్నీ సీన్స్ మన నెటివిటీకి తగిన విధంగా చేంజస్ చేశాం. సినిమా రెండు సాంగ్స్‌, రెండు రోజుల ప్యాచ్ వర్క్ మినహా మొత్తం పూర్తయింది. చిత్రీకరణకు సమాంతరంగా పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం సినిమాను ఫిభ్రవరి 5న రిలీజ్ చేయాలనుకుంటున్నాం.  జనవరి 16న ఆడియో రిలీజ్‌ ఉంటుంది.

క్యారెక్టర్...

ఈ చిత్రం విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది. పెర్ ఫార్మెన్స్ కు మంచి స్కోప్ ఉంది. ఎమోషనల్‌ కమర్షియల్‌ఎంటర్‌టైనర్‌. కాబట్టి బాడీ లాంగ్వేజ్‌ నుండి చాలా విషయాల్లో జాగ్రత్తలు తీసుకున్నాను. అన్నీ విషయాల్లో కేర్‌ తీసుకుని ఈ సినిమాలో నటించాను. నా తొలి సినిమాకు ఏ మాత్రం తగ్గని ఫైట్స్, డ్యాన్సులు ఉంటాయి. ఆ చిత్రం కంటే పదిరెట్లు కష్టపడ్డాను.

అందుకే సెలక్టివ్ గా....

మంచి సినిమాలు చేయాలనుంది. రెండు మూడు సినిమాలు సెలక్టివ్ గా ఉండాలనుకున్నాను. తర్వాత నుండి ఏడాది రెండు, మూడు సినిమాలు చేయాలనే ప్లానింగ్ ఉంది.  

బోయపాటి సినిమా గురించి...

నా సెకండ్‌ ప్రాజెక్ట్‌ బోయపాటిగారితో చేయాల్సింది. కానీ అంత కంటే ముందే బన్ని, బోయపాటి సినిమా చేయాలనుకున్నారు. కానీ బన్ని ఆరు నెలలు పాటు బిజీగా ఉండటంతో ఆ గ్యాప్ లో నాతో సినిమా చేయాలని బోయపాటిగారు అనుకున్నారు కానీ కథ సంతృప్తిగా అనిపించక ఆగిపోయాం. ఏప్రిల్ 8 నుండి బోయపాటిగారి సినిమా ఉంటుంది. డిస్ట్రిబ్యూటర్స్ అభిషేక్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మార్చిలో షూటింగ్ ఉంటుంది.

వండర్ ఫుల్ ఎక్స్ పీరియెన్స్....

వండర్‌ఫుల్‌ ఎక్స్‌పీరియెన్స్‌ ప్రతి విషయంలో డిటెయిల్డ్‌గా ఉంటారు. క్లారిటీతో పాటు పర్టిక్యులారిటీ ఎక్కువగా ఉంటుంది. సీన్‌  చేసేటప్పుడే పర్‌ఫెక్ట్‌ ఎగ్జిక్యూషన్‌ ఉండేలా చూసుకుంటారు.  

నెక్ట్స్‌ ప్రాజెక్ట్స్‌...

బోయపాటి శ్రీనుగారి దర్శకత్వంలో ఓ సినిమా. విజయ్ కుమార్ కొండాగారి దర్శకత్వంలో జయన్న కంబైన్స్, సీడెడ్ డిస్ట్రిబ్యూటర్ లక్ష్మికాంత్ రెడ్డి నిర్మాణంలో మరో సినిమా ఉంటుందంటూ  ఇంటర్వ్యూ ముగించారు యంగ్‌ అండ్‌ ఎనర్జిటిక్‌ హీరో బ్లెంకొండ సాయిశ్రీనివాస్‌...

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?