Advertisement

Advertisement


Home > Movies - Interviews

టాగ్ లేకుండా వుండాలన్నదే నా ప్రయత్నం

టాగ్ లేకుండా వుండాలన్నదే నా ప్రయత్నం

నాని..టాలీవుడ్ లోని యంగ్ హీరోల్లో తక్కువ కాలంలోనే తనకంటూ ఓ పేరు సంపాదించుకున్న హీరో. టాలీవుడ్ లో అడుగుపెట్టిన స్వల్పకాలంలోనే ఎత్తులు, పల్లాలు రెండూ చూసేసాడు. ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో మళ్లీ ముందుకు వెళ్తున్నాడు. నాని నటించిన లేటెస్ట్ మూవీ భలే భలే మగాడివోయ్..మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో నానితో ఇంటర్వూ.

మగాడు..భలే భలేగా ఎలా వుండబోతున్నాడు

నిజంగానే భలేగా వుంటాడు. ఫస్ట్ టైమ్ సినిమా విడుదల కాకుండానే కంగ్రాట్స్ చెబుతున్నారు అంతా. దీంతో టెన్షన్ మరింత పెరగిపోతోంది. సినిమా మీద చాలా పాజిటివ్ బజ్ వచ్చింది. దర్శకుడు మారుతి మంచి క్యారెక్టర్ డిజైన్ చేసారు.

సినిమా రంగంలోకి అడుగుపెట్టిన అనతికాలంలోనే వరసగా హిట్ లు ఇచ్చారు. అంతలోనే అంతగా ఆకట్టుకోని సినిమాలు చేసారు. తక్కువ అనుభవంతో ఎలా తట్టుకున్నారు?

మీరన్నది నిజమే.చాలా తక్కువ టైమ్ లోనే నాకు రెండూ అనుభవంలోకి వచ్చాయి. వరుసగా ఆరు సినిమాలు..ఈగ వరకు సూపర్ హిట్ లే. ఆ తరువాత రెండు మూడు సినిమాలు కాస్త ఇబ్బంది పెట్టాయి. ఎలా తట్టుకున్నా, ఎలా ప్లానింగ్ మార్చా అనే కన్నా, ఏం నేర్చుకున్నా అన్నది పాయింట్. అప్పటి దాకా, ఓ సినిమా చేయడం, మూడు నెలలు గ్యాప్ తీసుకోవడం, స్క్రిప్ట్ లు వినడం, కొత్త సినిమా ప్రారంభించడం. ఇదీ స్కీము.

కానీ ఈ స్కీము సరికాదని తెలుసుకున్నా. వరుసగా సినిమాలు చేస్తూనే వుండాలి. ఆపకూడదు. మనం బ్రేక్ తీసుకోవాలి అనుకుంటే, నిజంగానే బ్రేక్ పడిపోయే ప్రమాదం వుంది, అని అర్థం అయింది. ఎందుకంటే నిజానికి నాకు వచ్చినవి రెండు ప్లాపులే. అయితే ఓ ఏడాది పాటు సినిమా లేకుండా వుండడం, ఓ సినిమా విడుదలకు నానా ఇబ్బందులు పడడం వంటివి అన్నీ కలిసి, ఏదో అరడజను ఫ్లాపులు వచ్చినట్లు, నాని మరి కనిపించనట్లు అన్నంత ఫీల్ కలుగచేసాయి. అందుకే స్ట్రాటజీ మార్చా. వరుసపెట్టి, మనకు నచ్చిన సినిమాలు చేస్తూ పోవాలి. వాటిలో జనం నచ్చినవి కొన్ని వున్నా చాలు. 

ఇప్పటిదాకా మీకు హిట్ లు ఇచ్చిన వాటిలో అష్టా చెమ్మా, అలా మొదలైంది, పిల్ల జమీందార్, ఇప్పుడీ భలే భలే మగాడివోయ్..అనీ ఫన్ అండ్ ఎంటర్ టైన్ మెంట్ జోనర్లే. మీరు డిఫరెంట్ గా అని ప్రయత్నించిన వాటిలో పైసా, జెండాపై కపిరాజు అంతా ఫలితాలు ఇవ్వలేదు. ఇది కూడా మీ నిర్ణయం మీద ప్రభావం చూపిందా?

కచ్చితంగా. ప్రేక్షకులు నేను ఏ జోనర్ ట్రయ్ చేసినా, అందులో ఫన్, ఎంటర్ టైన్ మెంట్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారని అర్థమయింది. అందుకే ఇకపై ఏ సినిమా చేసినా, అవి కూడా కొంతయినా వుండేలా చూసుకుంటున్నాను.

నాని అంటే ఈ తరహా సినిమా అని జనాలు ఎలా గుర్తుపెట్టుకోవాలి.

పోస్టర్, ట్రయిలర్ చూసే దాకా ఈ సినిమా ఇలా వుంటుంది అని ప్రేక్షకులు డిసైడ్ కాకూడదు. అలా అన్ని జోనర్లు ట్రయ్ చేయాలి. నా మీద అభిమానంతో రావాలి. కానీ నేను ఏ సినిమా చేసానా అన్న ఇంట్రస్ట్ వుండాలి. 

నెగిటివ్ షేడ్ వున్న 'ఎవడే సుబ్రహ్మణ్యం' చేసింది అందుకేనా?

కచ్చితంగా. ఆ సినిమా చేయడం వల్ల నటుడిగా నాకు గౌరవం పెరిగింది. హీరో అనిపించుకోవడం వేరు, నటుడుగా ప్రూవ్ చేసుకోవడం వేరు. ఎక్కడి కెళ్లినా ఆ సినిమా గురించి ప్రస్తావించి నన్ను అభినందిస్తున్నారు.

మీ ఏజ్ గ్రూప్ హీరోలు చాలా ఎక్కువ మంది వున్నారు. ఒక కథ ఇద్దరు ముగ్గురికి నప్పే పరిస్థితి వుంది. ఈ కాంపిటీషన్ ను ఎలా ఫేస్ చేస్తున్నారు.

మీరన్నది కొంతవరకు నిజమే. కానీ అవేవీ ఆలోచించను. మన దగ్గరకు వచ్చిన స్క్రిప్ట్ బాగుందా లేదా..బాగుంటే చేసేయడం. మన వంతు మరింత బాగా చేయడం. 

మీతో సినిమా చేస్తే, చాలా సులువుగా పని అయిపోతుంది అంటున్నారు మారుతి.  మీ కామెంట్?

నేను మామూలుగానే ఖాళీగా కూర్చోలేనండీ. నా షాట్ అయిపోయింది. కారవాన్ లోకి వెళ్లిపోవడం అన్నది నాకు సరిపడదు. అంతకు ముందు డైరక్షన్ డిపార్ట్ మెంట్ లో పని చేసా కదా, ప్రతీదీ తెలుసు. ఇంకా తెలుసుకోవాలని వుంటుంది. ఇది ఇన్ వాల్వ్ మెంట్ అంతే ఇంటర్ ఫియర్ కాదు. సీన్ చెబితే నాకు వదిలి పెడితే నాలుగైదు ఆప్షన్లు ఇచ్చి, దర్శకుడి చాయిస్ కు వదిలేస్తాను. 

భయంకరమైన ఫ్లాప్ ఇచ్చిన తరువాత ఇంద్రగంటితో సినిమా చేస్తున్నారు?

డిజాస్టర్స్ అందరికీ వుంటాయి. మహా మహా దర్శకులు అందరికీ వున్నాయి. కానీ అవి కసిని పెంచుతాయి. అందుకే మోహన కృష్ణ కు ఓకె చెప్పా. ఆయన సూపర్ అండ్ మోస్ట్ సెన్సిబుల్ డైరక్టర్..విన్న వెంటనే ఎక్సయిట్ అయ్యా. ఏడేళ్ల ఏళ్ల తరువాత ఆయనతో కలిసి చేస్తున్నా. స్క్రిప్ట్ అయితే అదిరిపోయింది. లాట్ ఆఫ్ ఫన్ అండ్ థ్రిల్లింగ్..

అగ్ర దర్శకుడు రాజమౌళి 'భలే. భలే'  సినిమాకు ముందుగానే అభినందనలు అందించినట్లున్నారు.

అవునండీ. ఆయన నిజంగా గ్రేట్. ఆయన వున్న టైమ్ లోఇండస్ట్రీలో నేనూ వున్నా అని చెప్పుకోవడం నాకు గర్వంగా వుంటుంది. ఇప్పుడు అని కాదు, నా ప్రతి సినిమాకు, మార్నింగ్ షో ముగిసిన అయిదునిమషాలకు ఆయన ఫోన్ చేస్తారు. నిర్మొహమాటంగా తన అభిప్రాయం చెబుతారు. ఈ సినిమా కూడా ఆయనతో కలిసే చూస్తానేమో?

అంత అభిమానం వుంది కదా..మరి బాహుబలిలో చోటు దొరకలేదని బాధనిపించిందా?

లేదు. ఆయన నికార్సయిన మనిషి..మనం సూట్ ఫలనా పాత్రకు అనుకుంటే, కచ్చితంగా పిలుస్తారు. ఈగ అలాగే ఇచ్చారుగా. లేదు అంటే లేదు. ఆ విషయంలో ఆయనకు మొహమాటాలు వుండవు. పాత్రలకు తగిన నటులు అంతే.

లిప్ టు లిప్ మళ్లీ ట్రయ్ చేయలేదు.

బాబోయ్..ఒక్కసారి..ఆహా కళ్యాణంలో చేసాను. కథకు చాలా కీలకం అని చేసా..చాలా టెన్షన్ పడ్డా.

అంత టెన్షన్ ఏముంది?

సినిమాతో కాదు..నా వైఫ్ తో, నా కజిన్స్ తో. అందరి ముందు కాస్త తగ్గిపోయింది నా లెవెల్. నా వైఫ్ అయితే ఆ రోజు ఆ సీన్ చూడకుండా బయటకు వచ్చేసింది.చాలా హంగామా జరిగింది. లోపలికి మరి రానని ..కళ్ల నీళ్లోచ్చేసి..రియాక్షన్ ఆ లెవెల్లోవుంది.. ఎలా మేనేజ్ చేయాలో అర్థం కాలేదు... మహా సెన్సిటివ్. సినిమా విడుదలయింది..సమీక్షలు, టాక్, ఇవన్నీ పట్టడం లేదు, తనని ఎలా సముదాయించాలా అనే. ఓ పూటంతా పట్టింది. అప్పుడే అనుకన్నా. ఇక మళ్లీ వద్దు అని. 

బాలయ్య ఫ్యాన్ గా చేస్తున్న సినిమా ఎలా వుంటుంది?

అది కూడా మంచి సబ్జెక్ట్. బాలయ్య ఫ్యాన్ గా వుంటాను. చాలా ఇంట్రస్టింగ్ పాయింట్ వుంది. అది సినిమా పూర్తయ్యాక, ట్రయిలర్ విడుదలప్పుడు చెబుతాను.

భలే..భలే..ఏ ఏ సెంటర్ల సినిమా అనుకుంటున్నారు

ఇది అన్ని సెంటర్ల సినిమా. ఎ, బి, సి ఇలా అన్నీ. అందుకే చాలా టెన్షన్ గా, ఎగ్జయిటింగా వుంది రిజల్ట్ కోసం

విష్ యు బెస్టాఫ్ లక్

థాంక్యూ

విఎస్ఎన్ మూర్తి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?