Advertisement

Advertisement


Home > Movies - Interviews

తిరిగివ్వడాన్ని మించింది చెప్పాం : 'గ్రేటాంధ్ర'తో మహేష్‌

తిరిగివ్వడాన్ని మించింది చెప్పాం : 'గ్రేటాంధ్ర'తో మహేష్‌

గ్రేటాంధ్ర : 'ఊరికి తిరిగి ఇవ్వాలి' అనే ఒక ఉదాత్తమైన భావాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే ఉద్దేశంతో సినిమా చేసినందుకు ముందుగా అభినందనలు. 

మహేష్‌ : థాంక్యూ 

ఈ సందర్భంగా మరికొన్ని విషయాలను కూడా మహేష్‌బాబు పంచుకున్నారు. 

నాకు డైరక్షన్‌ చేయాలనే ఆలోచన లేదు. నన్ను ఎవరైనా డైరక్షన్‌ చేస్తున్నావా అని అడిగారంటే.. నన్ను ఇండస్ట్రీ నుంచి పంపేయడానికి చూస్తున్నారని అనిపిస్తుంది. నేను ఎప్పుడూ డైరక్టర్స్‌ చెప్పినట్లుగా పెర్ఫార్మ్‌ చేస్తే చాలనుకుంటుంటాను. 

జగపతి బాబు ఈ చిత్రంలో కేరక్టర్‌ చేయడానికి ఒప్పుకుంటారో లేదో అనుకుంటూ ఆయనను ఎప్రోచ్‌ అయ్యాం. ఎందుకంటే కథలో ఆ పాత్రను విన్నప్పుడు దానికి మంచి సబ్‌స్టన్స్‌ ఉన్న, స్టేచర్‌ ఉన్న నటుడు కావాలని అనిపించింది. ఆయన ఒప్పుకుంటారో లేదో అనే సందేహంతోనే వెళ్లి అడిగాం. ఆయన కథ విన్న వెంటనే ఒప్పేసుకున్నారు. 

నిర్మాతగా మారడం అనేది నా ఆంబిషన్‌ కాదు. ఈ చిత్రంలో కూడా సహనిర్మాతగా వ్యవహరించాలన్నది తొలినుంచి ఉన్న ఆలోచన కాదు. కొంత సినిమా జరిగిన తర్వాత.. అన్నయ్య రమేష్‌ వచ్చి నాకు ఆ సలహా ఇచ్చారు. క్వాలిటీ మెరుగుపడుతుంది కదా అని చెప్పారు. వెంటనే ఆ విషయం నిర్మాతతో మాట్లాడా. ఆయన కూడా వెంటనే ఒప్పుకున్నారు. 

ఈ చిత్రం తమిళ వెర్షన్‌ కూడా విడుదల అవుతోంది. సినిమా సబ్జెక్టులోని బలమే.. మమ్మలిన తమిళంలో కూడా స్ట్రెయిట్‌ చిత్రంతరహాలో ఒకేరోజున విడుదల చేయడానికి ప్రేరేపించింది. సినిమా కాన్సెప్టు యూనివర్సల్‌ కావడంతో.. తమిళంలో చేయాలనుకున్నాం. అక్కడ అందరూ కూడా స్ట్రెయిట్‌ ఫిలిం లాగానే రిలీజ్‌ చేయమని అడిగారు. అలాగే చేస్తున్నాం. 

నాకు ప్రత్యేకంగా డ్రీమ్‌రోల్స్‌ అంటూ ఏమీ ఉండవు. ప్రతి సినిమా లో పాత్రని డ్రీమ్‌రోల్‌గానే అనుకుని చేస్తుంటాను. ఈ చిత్రంలో మంచి ఎమోషన్స్‌ ఉంటాయి. నిండుగా ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉంటుంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ అంటే కేవలం హ్యూమర్‌ మాత్రమే కాదు.. ఇటీజ్‌ ఎవిరీథింగ్‌. 

బాలీవుడ్‌కు వెళ్లే ఆలోచన మాత్రం లేదు. నిజం చెప్పాలంటే నాకు అంతం టైం లేదు. ఇక్కడే ఒక సినిమా చేయడానికి 7-8 నెలలు పడుతోంది. హిందీలో ఒక్కో చిత్రం మూడేళ్లు పట్టేస్తుంది. ఇక్కడ నా సినిమాలన్నీ ఆగిపోతాయి. అందుకే అంత టైం లేదనుకుంటున్నాను. 

ఫ్రెండ్షిప్‌ డే విషయానికి వస్తే.. నాకు ప్రత్యేకంగా ఫ్రెండ్స్‌ అంటూ ఎవరూ లేరు. నా ఫ్రెండ్స్‌ అంతా మదరాసులోనే ఉండిపోయారు. నాతో కలిసి పనిచేసిన దర్శకులే నాకు ఫ్రెండ్స్‌. 

- సురేష్

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?