Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అదుర్స్-2.. ఇంకా నలుగుతోంది!

అదుర్స్-2.. ఇంకా నలుగుతోంది!

ఎన్టీఆర్-వినాయక్ కాంబినేషన్ లో వచ్చిన అదుర్స్ సినిమా అందరికీ నచ్చింది. ఈ మూవీ సాధించిన వసూళ్లు, రికార్డుల సంగతి పక్కనపెడితే.. టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఎంటర్ టైనింగ్ మూవీస్ లో ఒకటిగా పేరుతెచ్చుకుంది అదుర్స్. ఈ సినిమాకు సీక్వెల్ చేయాలనే కోరిక వినాయక్ కు బాగా ఉంది. ఆ విషయం మరోసారి తెరపైకొచ్చింది.

ఎన్టీఆర్ తో ఎప్పటికైనా అదుర్స్-2 చేస్తానని ప్రకటించాడు వినాయక్. ఓ మంచి ఎంటర్ టైనింగ్ స్క్రిప్ట్ కోసం ఎదురుచూస్తున్నామని, స్క్రిప్ట్ దొరికితే తారక్ కాల్షీట్లు పట్టుకోవడం పెద్ద కష్టం కాదంటున్నాడు వినాయక్. ఓ మంచి స్క్రిప్ట్ రెడీ చేయొచ్చుకదా అంటూ తన పక్కనే ఉన్న కోన వెంకట్ ను కోరాడు వినాయక్.

అయితే తారక్ ను దగ్గరుండి పరిశీలిస్తున్న వ్యక్తులు మాత్రం ప్రస్తుతం అతడి మైండ్ సెట్ కు అదుర్స్-2 సెట్ కాదని అంటున్నారు. ఈ సినిమాకు సీక్వెల్ చేయాలని అప్పట్లో ఎన్టీఆర్ భావించినప్పటికీ.. ప్రస్తుతానికి అతడికి అలాంటి ఆలోచనల్లేవని చెబుతున్నారు.

టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ.. ఇలా ఒక్కో సినిమాతో డిఫరెంట్ గా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్న ఎన్టీఆర్.. సీక్వెల్ ను సెట్స్ పైకి తీసుకొచ్చే మూడ్ లో లేడని చెబుతున్నారు. కానీ సరైన స్టోరీ పడితే.. చారి క్యారెక్టర్ లో కనిపించడానికి ఎన్టీఆర్ ఒప్పుకుంటాడని నమ్మకంగా ఉన్నారు అభిమానులు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?