Advertisement


Home > Movies - Movie Gossip
చరణ్-మణిరత్నం సినిమా ఇక లేనట్టేనా..?

చెలియా దెబ్బతో మంచి ఛాన్స్ పోగొట్టుకున్నాడు మణిరత్నం. రామ్ చరణ్ తో చేయాల్సిన సినిమాను దాదాపు మిస్ చేసుకున్నట్టే. తెలుగు-తమిళ భాషల్లో చెలియా మూవీ డిజాస్టర్ అయింది. దీంతో మణిరత్నం సినిమాను చరణ్ పక్కనపెట్టినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మెగా కాంపౌండ్ నుంచి ఎలాంటి సమాచారం లేనప్పటికీ... మణిరత్నం మాత్రం పరోక్షంగా క్లారిటీ ఇచ్చేశాడు.

తాజాగా ఈ దర్శకుడు ఐశ్వర్యరాయ్ ను కలిశాడు. ఓ ఫిమేల్ సెంట్రిక్ స్టోరీని వినిపించాడు. ఇందులో ఐష్ భర్త అభిషేక్ బచ్చన్ కూడా ఉంటాడు. భార్యాభర్తలిద్దరూ కలిసే స్టోరీ విన్నారట. మణిరత్నం దర్శకత్వంలో నటించడానికి దాదాపు ఓకే చెప్పారట. గతంలో మణిరత్నం డైరక్ట్ చేసిన గురు సినిమాలో ఐష్-అభి కలిసి నటించిన విషయం తెలిసిందే. మళ్లీ ఇప్పుడు మరోసారి ఆ కాంబినేషన్ రిపీట్ అవుతోందన్నమాట.

ఐశ్వర్యరాయ్-అభిషేక్ బచ్చన్ కు మణిరత్నం స్టోరీ వినిపించడంతో.. చరణ్ తో ఇక సినిమా ఉండకపోవచ్చని అంతా అనుకుంటున్నారు. పైగా ఇప్పుడు ఐష్ చాలా ఖాళీ. స్టోరీ ఓకే అయితే వెంటనే సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ. మరోవైపు సుకుమార్ సినిమాతో చరణ్ ఫుల్ బిజీ. ఓవైపు సినిమా చేస్తూనే ఇంకోవైపు చిరంజీవి 151వ సినిమా వ్యవహారాలు కూడా చూసుకుంటున్నాడు. ఈ కాలిక్యులేషన్స్ అన్నీ చూసుకుంటే చరణ్-మణిరత్నం సినిమా ఇక లేనట్టే అనిపిస్తోంది.