Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఫినిషింగ్ టచ్ కు రెడీ అయిన మహేష్

 ఫినిషింగ్ టచ్ కు రెడీ అయిన మహేష్

మహేష్ బాబు ఫినిషింగ్ టచ్ కు రెడీ అయ్యాడు. ఎట్టిపరిస్థితుల్లో మరో 3 వారాల్లో సినిమాను పూర్తిచేయాలని ఫిక్స్ అయిన మహేష్.. మే 3 నుంచి స్పైడర్ సినిమాకు కాల్షీట్లు కేటాయించాడు. సినిమాకు సంబంధించి ఇదే ఆఖరి షెడ్యూల్. ఈ షెడ్యూల్ తో టోటల్ సినిమా కంప్లీట్ అయిపోతుంది. ఇప్పటికే మేజర్ యాక్షన్ పార్ట్, కీలకమైన సన్నివేశాలు పూర్తిచేశారు. ఫైనల్ షెడ్యూల్ లో మరికొన్ని సీన్స్ తో పాటు.. ఓ సాంగ్ పిక్చరైజ్ చేయబోతున్నారు.

మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి జూన్ 23ను రిలీజ్ డేట్ గా ఎనౌన్స్ చేశారు. అయితే ఆ తేదీకి సినిమా రావట్లేదు. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఆగస్ట్ 11కు స్పైడర్ సినిమాను థియేటర్లలోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాద్ లో ఫైనల్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. 

తెలుగు-తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై నిర్మాతలు భారీగా ఖర్చుచేస్తున్నారు. గత చిత్రం బ్రహ్మోత్సవం డిజాస్టర్ అయినప్పటికీ.. మహేష్ మార్కెట్ వాల్యూను దృష్టిలో పెట్టుకొని ఖర్చుకు వెనకాడ్డం లేదు. దర్శకుడు కమ్ హీరో సూర్య ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?