Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

బుల్లితెరపైకి ఎన్టీఆర్.. చిరు రికార్డు బ్రేక్?

బుల్లితెరపైకి ఎన్టీఆర్.. చిరు రికార్డు బ్రేక్?

బుల్లితెరపై చిరంజీవి క్రియేట్ చేసిన రికార్డును త్వరలోనే ఎన్టీఆర్ బ్రేక్ చేయబోతున్నాడు. అవును.. రియాలిటీ షో కోసం అత్యధిక రెమ్యూనరేషన్ అందుకోబోతున్న హీరోగా సరికొత్త రికార్డు సృష్టంచబోతున్నాడు ఎన్టీఆర్. గతంలో మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమం కోసం నాగార్జునకు, తాజాగా ఇదే షోకు చిరంజీవికి ఇచ్చిన ఎమౌంట్ కంటే అత్యధిక మొత్తాన్ని అందుకోబోతున్నాడట ఎన్టీఆర్.

త్వరలోనే స్టార్ మా లో బిగ్ బాస్ రియాలిటీ షో ప్రారంభం కానుంది. భారీ స్థాయిలో రాబోతున్న ఈ రియాలిటీ షో కోసం ఎన్టీఆర్ ను హోస్ట్ గా తీసుకున్నారు. ఈ మేరకు ఛానెల్ ప్రతినిధులు, ఎన్టీఆర్ మధ్య ఒప్పందం కూడా కుదిరింది. బిగ్ బాస్ షో ను హోస్ట్ చేసేందుకు ఎన్టీఆర్ కు భారీ మొత్తం ఇస్తోంది స్టార్ మా.

డీల్ అఫీషియల్ అయింది కనుక జై లవకుశ తర్వాత ఎన్టీఆర్ గ్యాప్ తీసుకోవడం గ్యారెంటీ అని తెలుస్తోంది. బిగ్ బాస్ షోకు సంబంధించి ఒక సిరీస్ పూర్తయిన తర్వాతే మళ్లీ నెక్ట్స్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్తాడు తారక్. సరే, సినిమాల సంగతి అటుంచితే బుల్లితెరపై ఎన్టీఆర్ యాంకరింగ్ ఎలా ఉంటుందనే ఎలిమెంట్ ఇప్పుడు ఎక్కువ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?