Advertisement


Home > Movies - Movie Gossip
ఎన్టీఆర్ బయోపిక్ లో రత్తాలు

రత్తాలు.. రత్తాలు సాంగ్ తో ఓ ఊపుఊపిన రాయ్ లక్ష్మీ గుర్తుందా.. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ లో జూలీ-2 ప్రమోషన్ లో బిజీగా ఉంది. ఇప్పుడీ బ్యూటీ తెలుగులో ఓ బయోపిక్ లో నటించనుంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కనున్న లక్ష్మీస్ వీరగ్రంధం సినిమాలో కీలకమైన లక్ష్మీపార్వతి పాత్రలో లక్ష్మీరాయ్ కనిపించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. 

లక్ష్మీరాయ్ ను సంప్రదించినట్టు ఈ సినిమా దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి స్వయంగా ప్రకటించారు. రాయ్ లక్ష్మితో పాటు వాణి విశ్వనాథ్ ను కూడా సంప్రదించామని.. వీళ్లలో ఎవరు లీడ్ రోల్ చేస్తారో రేపు ప్రకటిస్తామంటున్నాడు. 

ఈ సినిమా రేపట్నుంచే సెట్స్ పైకి రానుంది. ఎన్టీఆర్ గార్డెన్స్ లో ఉదయం 11.30నుంచి 12.30మధ్య ఈ సినిమా పూజా కార్యక్రమాలు మొదలవుతాయి. జయం మూవీస్ బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమాకు ఆదర్శ గృహిణి అనే ట్యాగ్ లైన్ కూడా పెట్టారు. 

ఎన్టీఆర్ జీవితంపై బాలయ్య-తేజ కాంబోలో ఒక సినిమా, వర్మ దర్శకత్వంలో 'లక్ష్మీస్ ఎన్టీఆర్' అనే మరో సినిమా రాబోతున్నాయి. ఈ రెండింటికంటే ముందే 'లక్ష్మీస్ వీరగ్రంధం' ప్రారంభంకాబోతోంది.