Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

100 వెర్సస్ 150 @ సంక్రాంతి

100 వెర్సస్ 150 @ సంక్రాంతి

సంక్రాంతి బరి మెగా-నందమూరి హీరోల ప్రెస్టీజియస్ ఫైట్ కు వదిలేస్తోంది టాలీవుడ్. ఇక మరే సినిమా కూడా సంక్రాంతి వైపు కన్నెత్తి చూడడంలేదు. క్రిష్ డైరక్షన్ లో బాలయ్య వందో సినిమా వెల్ ప్లాన్డ్ గా చకచకా సాగిపోతోంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్రాంతి బరిలోకి దింపాల్సిందే అని పట్టుదలగా వున్నారు ఇటు క్రిష్ అటు బాలయ్య కూడా. 

ఇప్పటికి ఇంకా మెగా సినిమాలు ఏవీ  ప్రారంభం కాలేదు. ఇటు పవన్ లేదా అటు చిరు తమ సినిమాల్లో ఏదో ఒకటి సంక్రాంతికి తేవాలన్నది వారి ఆలోచనగా వుంది. ఒకరు వస్తే మరొకరు తగ్గుతారు. 90శాతం అంచనా ప్రకారం చిరు సినిమానే వస్తుంది. ఎందుకంటే దీనికి సంబంధించి పోస్టు ప్రొడక్షన్ పనుల చకచకా సాగుతున్నాయి. స్క్రిప్ట్ ఓ కొలిక్కి వచ్చింది. 

రచయిత పరుచూరి వెంకటేశ్వర రావు విశాఖలో ఏకాంత వాసం చేస్తూ డైలాగ్ వెర్షన్ రెడీ చేస్తున్నారు. సో సంక్రాంతి బరిలో ఇటు చిరు 150 అటు బాలయ్య 100 వ సినిమా ఢీకొనడం గ్యారంటీగా కనిపిస్తోంది. అందుకే మహేష్ తన మురుగదాస్ సినిమాను ఏప్రిల్ రిలీజ్ కు షెడ్యూలు చేసుకుంటున్నాడు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?