Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

12 రోజులు 8 కోట్లు

12 రోజులు 8 కోట్లు

నందమూరి బాలయ్య వందో సినిమా కాస్త భారీ వ్యవహారంగానే మారుతోంది. మొరాకోలో తొలి షెడ్యూలు పూర్తి చేసి వచ్చారు. కేవలం పన్నెండు రోజుల షూట్ కు ఎనిమిది కోట్ల వరకు ఖర్చుచేసినట్లు వినికిడి. పైగా ఇది తొలి షెడ్యూలు మాత్రమే. ఇంకా చాలా సినిమా వుంది. ఇక్కడ ఓ భారీ సెట్ రెడీ అవుతింది. 

ఈ షెడ్యూలు కూడా భారీ స్టార్ కాస్ట్ వుంది. డైలీ ఎక్స్ పెండిచర్ కాస్త భారీగానే వుండే అవకాశం వుంది. ఎంత వందవ సినిమా అయినా, బాలయ్య మార్కెట్ ను కూడా చూసుకోవాలి. లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్ వసూళ్లే నలభై కోట్లు దాటాయంతే. పోనీ ఇప్పుడు రేట్లు పెరిగాయి.. శాటిలైట్ ఇతరత్రా వ్యవహారాలు వుంటాయి అనుకున్నా, 60 కోట్లకు మించి మార్కెట్ అంటే కాస్త ఆలోచించాలి. 

టాకీ పార్ట్ కే ఈ రేంజ్ లో ఖర్చుచేయడం అంటే, పోస్ట్ ప్రొడక్షన్ పనులు, త్రీజీ వ్యవహారం ఇంకా వుండనే వుంటుంది. మరి ఏ ధీమాతో క్రిష్ అండ్ కో ఈ రేంజ్ లో వెళ్తున్నారో?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?