Advertisement


Home > Movies - Movie Gossip
సినిమా రిలీజ్ రోజున టీజర్ విడుదల

లెక్కప్రకారం జనవరి 25న 2.0 సినిమా విడుదలకావాలి. కానీ ఆ తేదీ నుంచి ఏప్రిల్ కు సినిమా పోస్ట్ పోన్ అయింది. ఏప్రిల్ 27న మూవీ థియేటర్లలోకి వస్తోంది. ఈ మూవీకి సంబంధించి జనవరి నుంచి ప్రచారం ప్రారంభించాలని నిర్ణయించారు. 

జనవరి 26న 2.0 సినిమాకు సంబంధించి టీజర్ విడుదల చేయబోతున్నారు. పాత షెడ్యూల్ ప్రకారం టీజర్ రిలీజ్ అనేది హైదరాబాద్ లో జరగాలి. తాజాగా మారిన ప్లాన్ ప్రకారం టీజర్ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ లో ఉంటుందా ఉండదా అనేది డౌట్. 

ఇక సినిమాకు సంబంధించి ఫిబ్రవరిలో 2సాంగ్ బిట్స్ రిలీజ్ చేయబోతున్నారు. వాటి తర్వాత మార్చిలో ట్రయిలర్ రిలీజ్ ఉంటుంది. ఈ గ్యాప్స్ లో హాట్ ఎయిర్ బెలూన్లు ఎగరేయడం, సినిమాకు సంబంధించి చిన్నచిన్న పోటీలు నిర్వహించడం, కొత్త స్టిల్స్ రిలీజ్ చేయడం, టెక్నికల్ టీమ్ తో ఇంటర్వ్యూలు ఇప్పించడం లాంటివి చేస్తారు.

తాజా సమాచారం ప్రకారం తెలుగులో ఈ సినిమా విడుదలకు అడ్డంకులు తొలిగిపోయినట్టు తెలుస్తోంది. అటు బాలీవుడ్ లో చర్చలు ఇప్పుడిప్పుడే ప్రారంభమయ్యాయి. క్రిష్ దర్శకత్వంలో కంగనా లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న మణికర్నిక సినిమాను వాయిదా వేసే అవకాశాలున్నాయి.