Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

4,5 తేదీల్లో కొన్ని అరెస్టులు?

4,5 తేదీల్లో కొన్ని అరెస్టులు?

డ్రగ్ కేసు ప్రకంపనులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. నోటీసులు అందుకున్నవారు వెళ్తున్నారు. వివరణలు ఇచ్చి వస్తున్నారు. అయితే తెరవెనుక వేరే సంగతులు నడుస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కేసును పకడ్బందీగా తయారుచేయడానికి, అన్నీ, సకల విధాలా రెడీ చేసుకున్న తరువాతే అరెస్టులు చేయడానికి విచారణాధికారులు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

కేవలం ఇప్పటికి అరెస్టు చేసిన వారి నుంచి సంపాదించిన సాక్ష్యాలు రుజువులు కాకుండా, పోలీసులు విచారణ ద్వారా సంపాదించిన రుజువులు, సాక్ష్యాలు, అలాగే వారంతట వారు ఇచ్చిన స్టేట్ మెంట్ లు, ఇలా మొత్తం కేసును పకడ్బందీగా తయారుచేసిన తరువాత అరెస్టులు స్టార్ట్ చేస్తారని తెలుస్తోంది.

కనీసం నలుగురు సినిమా సెలబ్రిటీల అరెస్టు ఖాయం అనే గుసగుసలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే ఈ అరెస్టులు అన్నీ నాలుగు లేదా అయిదో తేదీ తరువాతే వుంటాయని వార్తలు వినిపిస్తున్నాయి. అప్పటికి అన్ని విచారణలు పూర్తవుతాయని, అలాగే ల్యాబ్ రిపోర్టులు వస్తాయని తెలుస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?