Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఆ సినిమాకూ ట్రయిలర్ లేదట

ఆ సినిమాకూ ట్రయిలర్ లేదట

9న విడుదలకు చకచకా ముస్తాబవుతోంది వరుణ్ తేజ-రాశీఖన్నాల తొలిప్రేమ. ఈ సినిమా ఆడియో ఫంక్షన్ మరికాసేపట్లో జరగబోతుంది. సాధారణంగా ఆడియో ఫంక్షన్ అంటే సినిమా ట్రయిలర్ వస్తుంది, ఆపై ఓ అంచనా వస్తుంది అని ఊహిస్తారంతా. ఈ మధ్య ఆడియో ఫంక్షన్ బదులు ముందే ఆన్ లైన్ లోకి ట్రయిలర్ వదిలేసి, తరువాత ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేస్తున్నారు. అదో టైపు,

అయితే తొలి ప్రేమకు ఆడియో ఫంక్షన్ నే చేస్తున్నారు కాబట్టి, ట్రయిలర్ వస్తుందన్న ఆలోచనలతో వున్నారు అంతా. కానీ ఈ ఫంక్షన్ లో ట్రయిలర్ వదలడం లేదని తెలుస్తోంది. కేవలం ఆడియో మాత్రమే విడుదల చేస్తారట. మళ్లీ మరో వారం లేదా అయిదు రోజులు ఆగి ట్రయిలర్ విడుదల చేస్తారట.

తొలి ప్రేమ సినిమాను నిర్మాత దిల్ రాజు దగ్గర దగ్గర 17 కోట్ల రేంజ్ లో మినిమమ్ గ్యారంటీకి వరల్డ్ వైడ్ హక్కులు తీసేసుకోవడంతో, దానిపై మాంచి ఆసక్తి నెలకొంది. దానికి తోడు విడుదల చేస్తున్న విజువల్స్ అన్నీ కూడా ఆసక్తి కరంగా వుంటున్నాయి. అలాంటపుడు ట్రయిలర్ కూడా వదలేస్తే మరింత బజ్ వస్తుంది. కానీ ఎందుకో అలా చేయడం లేదు మరి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?