Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఆ డైరక్టర్ ను ఎందుకు లాక్ చేసినట్లు?

ఆ డైరక్టర్ ను ఎందుకు లాక్ చేసినట్లు?

క్షణం సినిమా తో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించాడు పేరపు రవికాంత్. ఒక సస్సెన్స్ థ్రిల్లర్ కు పెర్ ఫెక్ట్ స్క్రిప్ట్ సమకూర్చడమే కాకుండా, ఏది ఎంత మోతాదులో వుండాలో అంతే మోతాదులో సమకూర్చి, కేవలం కోటి రూపాయిల ఖర్చుతో ఓ మాంచి సినిమాను అందించాడు. ఆ వెంటనే అతగాడిని లాక్ చేసేసారు. 

ఎవరు అనుకుంటున్నారు.. సురేష్ మూవీస్ కోసం.. హీరో రానా? మరి రానా ఏం చేద్దామనుకుంటున్నాడో రవికాంత్ తో? తను ఏమన్నా చిన్న సినిమా ఒకటి చేద్దాం అనుకుంటున్నాడా? లేదా సురేష్ బ్యానర్ పై వేరే ఏదన్నా సినిమా తీయించాలని ప్లాన్ చేస్తున్నాడా? ఇది కాక క్షణం హిందీ వెర్షన్ వుండనే వుంది మరి.  

హిట్ సినిమా ఇవ్వడం భయం, కొత్త డైరక్టర్లను లాక్ చేస్తున్నారు. దాంతో వాళ్ల మరో సినిమా చేయడానికి ఏళ్లు పూళ్లు పడుతొంది. ఉయ్యాలజంపాల డైరక్టర్ ది ఇదే పరిస్థితి..రన్ రాజా రన్ డైరక్టర్ సంగతి ఇదే. ఇలా మరి కొంతమంది కూడా వున్నారు మరి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?