Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఆ హీరోకి కథ చెప్పేసాడు శ్రీనువైట్ల

ఆ హీరోకి కథ చెప్పేసాడు శ్రీనువైట్ల

మొత్తానికి మిస్టర్ నిరాశ నుంచి వేగంగానే తేరుకున్నారు డైరక్టర్ శ్రీను వైట్ల. ఓ మాంచి స్క్రిప్ట్ తయారుచేసి, కొద్ది రోజుల క్రితం ఫుల్ నెరేషన్ ఇచ్చేసాడట హీరో రవితేజకు. లైన్, స్క్రిప్ట్ అయితే నచ్చిందట హీరో రవితేజకు.

అయితే చేస్తాడా? చేయడా? అన్నది మాత్రం ఇంకా డిసైడ్ కాలేదు. ఏ విషయం చెప్పడానికి తనకు కాస్త టైమ్ కావాలని రవితేజ చెప్పినట్లు తెలుస్తోంది.

రవితేజ-శ్రీను వైట్ల కాంబినేషన్ లో దుబాయ్ శీను, వెంకీ లాంటి పెద్ద హిట్ లే వున్నాయి. అయితే అది గతం. ఇప్పుడు శ్రీనువైట్ల వెనుక వున్నది మూడు సినిమాల పరాజయం తప్ప వేరు కాదు. హీరో అనడం అంత వీజీ కాదు, నిర్మాత ముందుకు రావడం అంతకన్నా వీజీ కాదు. 

అయితే మిస్టర్ నిర్మించి నష్టపోయిన ఠాగూర్ మధునే మళ్లీ నిర్మాతగా ముందుకు వస్తున్నట్లు వినికిడి. ఇక రవితేజ ఏమంటారో చూడాలి. ఓకె అనేస్తే, మళ్లీ శ్రీనువైట్ల మరోసారి తన అదృష్టం పరీక్షించుకుంటారు.అదృష్టం మాట అలా వుంచితే, ఈసారి అయినా సీరియస్ గా స్క్రిప్ట్ ను డీల్ చేస్తారో? మరేం చేస్తారో? మరి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?