Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఆ హీరో 'అదనపు' కార్యక్రమాలు

హిట్ లు దొరికీ దొరకనట్లు దోబూచులాడుతున్న ఓ యువ హీరోకు అదనపు కార్యక్రమాలు ఎక్కవయ్యాయన్న టాక్ టాలీవుడ్ లో వినిపిస్తోంది. ఈ హీరో కార్యక్రమాలు హోటళ్లకు ఎక్కుతున్నాయని, అక్కడితో ఆగకుండా హీరోయిన్ల పరిచయాలు, లాబీయింగ్, సినిమా చాన్స్ లు ఇప్పించడాలు, అందుకోసం ఇతరత్రా వ్యవహారాలు షురూ అయ్యాయని కృష్ణనగర్ లో టాక్ వినిపిస్తోంది. 

సాధారణంగా సినిమా రంగంలో ఇలాంటివి మామూలే కానీ, హీరోల స్థాయి జనాలు ఇలాంటి పనలుకు పూనుకోరు. వారు వారి కెరియర్ పైనే దృష్టి పెడతారు. కానీ ఈ కుర్రాడు ఇలాంటి పనులకు దిగడంపై కృష్ణనగర్ జనాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఇంతో అంతో నటనా సామర్థ్యం, కాస్తో కూస్తో మార్కెట్ వున్న కుర్రాడు ఇలాంటి అదనపు పనులు మానేసి, తన కెరియర్ పైనే దృష్టి పెడితే మంచి స్థాయికి చేరడానికి అవకాశం కూడా వుందని సలహాలు వినిపిస్తున్నాయి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?