Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఆ ఒక్కటీ తప్ప...పూరీ జగన్నాధ్

ఆ ఒక్కటీ తప్ప...పూరీ జగన్నాధ్

రోగ్ సినిమాను ప్రమోట్ చేయడానికి చార్మి సారథ్యంలోని పూరి కనెక్ట్ సంస్థ కిందా మీదా అవుతోంది. స్టిల్స్, ఫస్ట్ లుక్ లు, వార్తలు ఇలా ఒకటేమిటి చాలా..అంటే చాలా. కానీ అసలు సినిమా ఎప్పుడు విడుదల అన్నది మాత్రం చెప్పడం లేదు. అమ్మకాలు పూర్తయ్యాయో లేదో కూడా తెలియదు. 

ఇప్పుడు లేటెస్ట్ గా వదిలిన వార్త ఏమిటంటే, రోగ్ సినిమా కథను సల్మాన్ కు వినిపించాడట పూరి. అది మాత్రమే కాదు మరి కొన్ని కథలు కూడా, వాటిల్లో ఏదో ఒకటి సల్మాన్ పిక్ చేసుకుంటాడట. అంటే రోగ్ వాటిల్లో ఒకటే కానీ, అది మాత్రమే కాదు. ఇలాంటి కబుర్లు అన్నీ చెప్పి రోగ్ కు బజ్ తేవాలనుకుంటున్నారు.

కానీ అది సాధ్యమవుతుందా? ఈ ప్లానింగ్ అంతా సినిమా మేకింగ్ ల మీద పెడితే అడక్కుండానే బజ్ వస్తుంది పూరి సినిమాలకు. ఎందుకంటే ఆయనకు ఆ స్టామినా వుంది. కానీ ఆయనకు వున్న టేకిటీజీ పాలసీతోనే వస్తోంది సమస్య అంతా.

రోగ్ కుర్రాడు బాగానే వున్నాడు. కొత్త హీరోయిన్ అందాలు బాగానే వున్నాయి. లుక్ లు బాగానే వున్నాయి. కానీ ఇలాంటివి మాత్రమే చూసి పూరిని సినిమాను ఇటు జనం, అటు బయ్యర్లు నమ్మే రోజులు పోయాయి. అందువల్లనే బహుశా ఈ సినిమా డేట్ ప్రకటించడంలో ఆలస్యం అవుతున్నట్లుంది?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?