Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఆ స్టిల్స్ అంత భయపెట్టాయా?

ఆ స్టిల్స్ అంత భయపెట్టాయా?

ఉన్నట్లుండి మైత్రీ మూవీస్ అధినేతలు పోలీస్ స్టేషన్ గుమ్మం ఎక్కారు. తమ సినిమా రంగస్ధలం 1985సినిమా స్టిల్స్ వగైరా కంటెంట్ లీక్ అవుతోందని, స్టిల్స్ సరే, సినిమా అసలు కంటెంట్ లీక్ అవుతుందేమో అన్న భయం వుందని పోలీసులకు ఫిర్యాదు చేసారు. నిజానికి మైత్రీ మూవీస్ నిర్మాతలు చాలా సాఫ్ట్ గా వుంటారు. హీరో ఎంత చెబితే అంత. డైరక్టర్ ఎలా చెబితే అలా. అంతకు మించి వాళ్లు స్వంతంగా ఏమీ నిర్ణయం తీసుకోరు. మరి ఇప్పుడు పోలీస్ ఫిర్యాదు చేసారు అంటే హీరోనో, డైరక్టర్ నో చెప్పి వుండాలి.

రంగస్థలం సినిమా ఏమీ రహస్యం కాదు. ఎప్పటి నుంచో రామ్ చరణ్ గెటప్ స్టిల్స్ రకరకాలుగా బయటకు వచ్చాయి. ఎంతో మంది జూబ్లి హిల్స్ లోని రంగస్థలం విలేజ్ సెట్ కు వెళ్లి చకచకా ఫొటోలు తీసుకుని వచ్చి సోషల్ నెట్ వర్క్ లో తోసేసారు.

అప్పుడేమీ ఫిర్యాదు చేయని వారు ఇప్పుడు ఎందుకు చేసినట్లు? రామ్ చరణ్ ఫస్ట్ లుక్ వదిలారు, పాత స్టయిల్ లోగో వదిలారు. రాజుగారి దేవతా వస్త్రాలు టైపులో సూపర్ అంటే సూపర్ అన్నారు. కానీ లోలోపల ఆ ఓల్డ్ టైప్ లోగో ఏమిటి? ఆ ముతక చొక్కా, లుంగీ ఏమిటి? సుకుమార్ ఏం చేస్తున్నారు అని ఫ్యాన్స్ గొణుక్కోవడం ప్రారంభించారు.

మరో పక్క ఇదే టైమ్ లో రంగస్థలం బిజినెస్ డీల్స్ క్లోజ్ అయ్యే వ్యవహారాలకు సంబంధించిన చర్చలు సాగుతున్నాయి. ఇలాంటి టైమ్ లో హీరోయిన్ సమంతకు సంబంధించిన అధ్భుతమైన స్టిల్స్ ట్విట్టర్ లోనూ, ఇతర సామాజిక మాధ్యమాల్లోనూ ప్రత్యక్షమయ్యాయి. స్టిల్స్ చూసిన వాళ్లు చాలా మంది షాక్ తిన్నారు.

కర్రల పొయ్యి దగ్గర కూర్చున్న సమంత డీ గ్లామర్ స్టిల్స్ చూసి, ఈ సినిమాను ఆంధ్రకు ముఫై అయిదు కోట్ల రేంజ్ లో, నైజాంకు 20కోట్ల రేంజ్ లో బిజినెస్ నా అన్న చర్చలు ప్రారంభమయ్యాయ. అదే విధంగా గేదెల్ని తోలుకెళ్తున్న సమంత, నెత్తిన జొన్నపొత్తులతో రామ్ చరణ్ ఇలాంటి స్టిల్స్ చూస్తుంటే, యంగ జనరేషన్ ఈ సినిమాను ఏ మేరకు ఆదరిస్తారు అన్న సందేహాలు వినరావడం ప్రారంభమైంది. 

ఇవన్నీ కలిసి సినిమా మార్కెటింగ్ ను దెబ్బ తీసేలా కనిపించింది. ఇంక మరేవైనా ఇలాంటి స్టిల్స్ పదేపదే బయటకు వస్తే, రేపు డబ్బులు కట్టే దగ్గర ఇబ్బందులు తలెత్తవచ్చు. అందుకే దీనికి బ్రేక్ వేయాలనుకున్నారు. ఓ ఫోలీస్ కంప్లయింట్ ఇచ్చి వుంచితే, లీక్ చేయాలనుకునే వారు జాగ్రత్త పడతారు. సినిమా 1985నాటి కంటెంట్ కనిపించకుండా వుంటుంది. అదే ఉద్దేశం ఈ ఫిర్యాదు వెనుక వుండి వుంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?