Home > Movies - Movie Gossip
‘ఆ విషయం’ నిజమేనా రేణూ?

రేణు దేశాయ్ మాజీ హీరోయిన్. లేదా పవర్ స్టార్ మాజీ భార్య. అదే హోదాలో ఎవరో ఒకరు పిలుస్తుంటారు. ఆమె మాట్లాడుతుంటుంది.  కానీ రాను రాను జనాలకు చికాకు, బోరు కొడుతోంది అన్నది వాస్తవం. సైకాలజీ చదివిన ఆమె సైకాలజీ ఏమిటోఅన్నది మాత్రం జనాలకు తెలియడం లేదు.

పవన్ చాలా మంచోడు. డబ్బన్నా, అధికారం అన్నా మోజు లేదు.

రెండు సినిమాలు చేస్తే చాలు ఏడాదికి.

విడిపోవడానికి రేణు కారణం కాదు. కానీ కారణం ఏమిటో చెప్పదు.

విడిపోయినపుడు పవన్ ఏమీ ఇవ్వలేదు. అప్పటికి ఉండే ఇల్లు తప్ప.

తనకు మళ్లీ పెళ్లి చేసుకోవాలని వుంది. కానీ పవన్ మాజీ భార్య అన్న దాని వల్ల ఎవ్వరూ రావడంలేదు.

మళ్లీ పెళ్లి చేసుకోకుండా చచ్చిపోతానేమో అని భయంగా వుంది.

ఇంకేమన్నా వుండిపోయాయా? పాయింట్లు?

పాడిందే పాడరా అన్నట్లు ఇదే పాట. కానీ పవన్ మంచోడు అయితే, తను కారణం కాకపోతే విడిపోవడానికి మరెవరు కారణం? మధ్యలో ఎవరైనా ‘మేధావులు’ పుల్లలు పెట్టారా? ఇండస్ట్రీలో వినిపించే ‘ఆ విషయం’ నిజమేనా?

మంచి స్నేహితులు. ఇంటికి వస్తున్నాడు. పిల్లల్ని చూస్తున్నాడు. కావాలనే అనుకుని విడిపోయారు.  రేణు కూడా పిల్లల్ని కన్నపుడల్లా కంగ్రాట్స్ చెబుతోంది. ఏ ఈర్ష, అసూయ లేదు.

మరింకేంటి సమస్య. పదే పదే ఎందుకు ఇలా ఇంటర్వూలు ఇవ్వడం. కొంతమంది ఇది రేణూ కావాలనే చేస్తోంది అని అనడం నిజమే అనుకోవాలా? పవన్ నుంచి ‘ఇంకేదో’ ఆశిస్తోంది రేణు అని అనుకోవాలా?