Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అ..ఆ నుంచి విశ్వనాధ్ అవుట్?

అ..ఆ నుంచి విశ్వనాధ్ అవుట్?

అ..ఆ..త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వస్తున్న తాజా సినిమా.  ఈ సినిమా కోసం దర్శకుడు..కళాతపస్వి కే విశ్వనాధ్ ను అడిగారని, ఆయన మేనేజర్ ముందు రోజుకు లక్ష అని,  ఆ తరువాత రెండు లక్షలని మాట మార్చారని వార్తలు వినవచ్చాయి. విశ్వనాధ్ అభిమానులు కాస్త బాధపడ్డారు. ఆయనేమిటి? అలా మాట మార్చడమేమిటి? అంతా వట్టిదే అని. 

కానీ అదే నిజమని తెలుస్తోంది. లక్షకు బదులు రెండు లక్షలు అనడంతో మరి దర్శకుడు త్రివిక్రమ్ కు నచ్చలేదో? లేదా నిర్మాత రాధాకృష్ణకే నచ్చలేదో,మొత్తానికి ఈ ప్రాజెక్టులోకి విశ్వనాధ్ ను తీసుకోవడం లేదని వినికిడి. ఆయన బదులుగా సీనియర్ యాక్టర్ గిరిబాబును తీసుకున్నారని తెలుస్తోంది. 

అయితే బడ్జెట్ కోసం అయితే విశ్వనాధ్ మార్చాల్సినంత అవసరం లేదు. ఎందుకంటే అంతకన్నా ఎక్కవే ఈ సినిమా కోసం ఖర్చు చేస్తున్నారు. కేవలం కేరవాన్ లే ఆరేడు వాడుతున్నారని, యాభై వరకు కార్లు నిత్యం షూటింగ్ కోసం తిరుగుతన్నాయని తెలుస్తోంది. కేవలం మాట పట్టింపు వల్లే ఇలా జరిగినట్లు తెలుస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?