Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఆదా మళ్లీ..కామియో?

ఆదా మళ్లీ..కామియో?

సన్నాఫ్ సత్యమూర్తిలో కాస్త చిన్న పాత్రలోనైనా తళుక్కున మెరిసింది ఆదాశర్మ. ఇప్పుడు మరో సినిమాలోనూ అలాంటి చిన్న పాత్ర చేస్తోందట. హరీష్ శంకర్ దర్శకత్వంలో సాయి ధరమ్ తేజతో దిల్ రాజు నిర్మిస్తున్న సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాలో ఓ పాత్ర చేస్తున్నట్లు ఆదాశర్మ చెప్పింది. 

కానీ అంతకన్నా డిటైల్స్ మాత్రం అడగద్దు అంటోంది. ఎందుకంటే ఆ పాత్ర చిన్నదైనా, చాలా ప్రాధాన్యత వుందని, కథను మలుపుతిప్పుతుందని, ఇంకా ఎవేవో చెబుతూ, అసలు విషయం మాత్రం చెప్పనంది. సినిమా విడుదలయ్యాక మీరే చూడండి అంటోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?