Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

‘ఆగడు’ 75.. ‘మగధీర’ 750.!

‘ఆగడు’ 75.. ‘మగధీర’ 750.!

మహేష్‌ తాజా సినిమా ‘ఆగడు’పై ఆసక్తికరమైన ట్వీటేశారు సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ. ఆయన ట్వీట్‌ సారాంశమేంటంటే, ‘ఆగడు’ 75 కోట్లు అయితే, ‘మగధీర’ 750 కోట్ల సినిమా అనుకోవాలని. వర్మ ఉద్దేశ్యం ఏంటబ్బా.? అని ఇప్పుడు సినీ జనం కిందా మీదా పడాల్సి వస్తోంది.

‘ఆగడు’, ‘మగధీర’ సినిమాలు వచ్చిన టైమ్‌ని బట్టి వర్మ ఈ కామెంట్‌ చేశాడట. ఆయా హీరోల కెరీర్‌లో బడ్జెట్‌ పరంగా భారీ సినిమాలన్నదే తన ఉద్దేశ్యమన్నది వర్మ వాదన. అయితే, ఇక్కడ ‘మగధీర’ సినిమా దాదాపుగా 75 కోట్లకు పైగానే వసూలు చేసింది. ‘ఆగడు’ సినిమా ఈ రోజే విడుదలైంది గనుక.. అదెంత వసూలు చేస్తుందన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.

యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌కీ, టెక్నికల్‌ బ్రిలియన్స్‌కీ వర్మ ఎలా పోలిక పెట్టారో కూడా ఎవరికీ అర్థం కావడంలేదు. వర్మ అంతరంగమేంటో తెలియాలంటే ఆయనే పెదవి విప్పాలి. వర్మ మాత్రం తన ట్వీట్‌తో అటు మెగా అభిమానుల్నీ, ఇటు మహేష్‌ అభిమానుల్నీ గందరగోళంలోకి నెట్టేశాడు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?