Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఆఖరికి హాస్యనటుడి పక్కన హీరోయిన్‌గా చేస్తుంది

ఆఖరికి హాస్యనటుడి పక్కన హీరోయిన్‌గా చేస్తుంది

హీరోయిన్‌కి అదృష్టం కలిసొస్తే తరతరాలకూ తరగని ఆస్తిని సంపాదించుకోవచ్చు. అదృష్టం వుండి కూడా మన ప్రయత్నం లోపిస్తే కెరీర్‌ అస్తవ్యస్తమయిపోతుంది అనడానికి ఉదాహరణ హీరోయిన్‌ సదా. ఎంతో గ్లామర్‌గా వుండి, మంచి టైమ్‌లో హీరోయిన్‌ అయిన సదాకు అప్పట్లో ముంబై అమ్మాయిలతో పోటీ కూడా వుండేది కాదు. అప్పట్లో హీరో నితిన్కి కొత్త సినిమా. 

ఆయనతో పోల్చుకుంటే సదానే కాస్త చొరవగా నటించిందని చెప్పాలి. మొదటి సినిమాతోనే ‘వెళ్ళవయ్యా వెళ్ళూ..’ అనే మేనరిజమ్‌తో ఎంతో క్రేజ్‌ సంపాదించుకున్న సదా ఇప్పుడు వడివేలు అనే తమిళ కమెడియన్‌ సరసన హీరోయిన్‌గా చెయ్యడం వార్త అయ్యింది. అపరిచితుడు లాంటి సూపర్‌ డూపర్‌ సినిమా హీరోయిన్‌ సదా ఎట్టకేలకు ఇప్పుడు ఓ కమెడియన్‌ పక్కన చెయ్యడం ఎలా భావించాలి.? సదాకు తెలుగు, తమిళ సినిమా పరిశ్రమ రెడ్‌ కార్పెట్‌ పరిచి మరీ ఆహ్వానించింది. 

ఎందుకో అపరిచితుడు తర్వాత ఆమె కన్‌ఫ్యూజ్‌ అయ్యింది. ఏ సినిమాలు ఒప్పుకోవాలి? ఏ హీరోతో చెయ్యాలి? అలా అలోచిస్తూ పుణ్యకాలం కాస్తా గడిచిపోయింది. అప్పటికే కొత్త హీరోయిన్స్‌ తెరను ఆక్రమించేశారు. అలా వెనకబడిపోయిన సదా ఇప్పుడు డాన్స్‌ ప్రోగ్రామ్‌కు గెస్ట్‌గా వచ్చి అలరిస్తున్న హీరోయిన్‌గా ఆమె విలువైన కాలాన్ని కోల్పోయింది. ప్రస్తుతం ‘ఏలి’ అనే సినిమాలో వడివేలు సరసన నటిస్తూ వార్తల్లోకెక్కింది. ఈసారయినా తన రేంజ్‌ని నిలబెట్టుకుంటుందని ఆశిద్దాం.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?