Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఆమె దశ ఓ రేంజ్‌లో తిరిగినట్టే.!

ఆమె దశ ఓ రేంజ్‌లో తిరిగినట్టే.!

తొలి సినిమా మంచి విజయాన్ని సాధించింది.. రెండో సినిమా కూడా ఆమెకు మంచి పేరు తెచ్చింది.. ఇంకేముంది, టాలీవుడ్‌లో ఆమె గోల్డెన్‌ లెగ్‌ అయిపోయింది. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరంటారా.? ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’ ఫేం రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఆ గోల్డెన్‌ బ్యూటీ. ఇప్పుడు టాలీవుడ్‌లో బోల్డెంత డిమాండ్‌ వున్న అందాల భామ ఎవరంటే ఠక్కున రకుల్‌ ప్రీత్‌సింగ్‌ పేరు గుర్తుకొస్తోంది చాలామందికి.

సమంత, శృతిహాసన్‌ రొటీన్‌.. రకుల్‌ ప్రీత్‌సింగ్‌ హాటెస్ట్‌ బ్యూటీ.. అని చిన్న నిర్మాతలు, ఓ మోస్తరు పెద్ద నిర్మాతలు ఆమె గురించే మాట్లాడుకుంటున్నారు. ఇక, పెద్ద నిర్మాతల దృష్టీ రకుల్‌ ప్రీత్‌సింగ్‌పై పడిరదట. అన్నట్టు, పవన్‌ సరసన ‘గబ్బర్‌సింగ్‌-2’లో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నటించనుందంటూ టాలీవుడ్‌లో ఓ గాసిప్‌ షురూ అయ్యింది. అంతే, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కి వున్న డిమాండ్‌ ఒక్కసారిగా డబుల్‌ అయిపోయింది.

ఇంకొక్క హిట్‌ పడితే, రకుల్‌ ప్రీత్‌సింగ్‌ టాప్‌ హీరోయిన్‌ అయిపోవడం ఖాయమనీ, ఇప్పటికే బాగా పెరిగిన ఆమె రెమ్యునరేషన్‌ ముందు ముందు అందనంత రేంజ్‌కి వెళ్ళిపోతుందని టాలీవుడ్‌ సినీ జనం చెప్పుకుంటున్నారు. ఆమె అదృష్టం కలిసొచ్చి, పవన్‌ సినిమాలో హీరోయిన్‌ అయితే.. ఒకేసారి కోటిన్నర రెమ్యునరేషన్‌ తీసుకునే తారగా ఆమె ఎదిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?