Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఆమెకు కోటి రూపాయలా.?

ఆమెకు కోటి రూపాయలా.?

పవన్‌కళ్యాణ్‌ సినిమాలో ఛాన్సొస్తే వదులుకుందట యాంకర్‌ అనసూయ. ‘అత్తారింటికి దారేది’ సమయంలో విన్పించిన గాసిప్‌ ఇది. అదెంత నిజమో అన్నది పక్కన పెడితే, అనసూయపై మరో హాట్‌ గాసిప్‌ షురూ అయ్యింది. ఆమెకు ఏకంగా ఓ నిర్మాత కోటి రూపాయల ఆఫర్‌ ఇచ్చాడట తన సినిమాలో నటించే విషయమై.

తెలుగు బుల్లి తెరపై హాట్‌ యాంకర్‌ ఎవరంటే ఠక్కున చెప్పే పేరు అనసూయే. న్యూస్‌ రీడర్‌గా కెరీర్‌ స్టార్ట్‌ చేసి, ఆ తర్వాత ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానల్స్‌లో యాంకరమ్మగా మారిన అనసూయ, ‘జబర్‌దస్త్‌’ కామెడీతో మరింత హాట్‌ ఇమేజ్‌ సొంతం చేసుకుంది. బుల్లితెరపై పలు కార్యక్రమాలతో బిజీగా వుందిప్పుడు అనసూయ. ఆమెతో సినిమా చేసేందుకు నిర్మాత కోటి రూపాయల ఆఫర్‌ ఇచ్చారన్నది నిజమేనా.? అని ఒక్కసారి ఆలోచిస్తే, అందులో నిజం లేదనే అన్పిస్తోందెవరికైనా.

అనుష్క, నయనతార, సమంత లాంటోళ్ల రెమ్యునరేషనే కోటిన్నర.. అలా వుంటే, బుల్లితెర స్టార్‌ అయినంతమాత్రాన అనసూయకి కోటి ఎలా ఇచ్చేస్తారు.! ఆ మాటకొస్తే, ఉదయభాను రేంజ్‌లో అయితే అనసూయ హాట్‌ అప్పీల్‌ ప్రదర్శించిందని అనుకోగలమా.? ఏమోగానీ, ఆ గాసిప్‌ పేరుతో అనసూయ మరోమారు వార్తల్లో వ్యక్తిగా మారింది. ఇంతకీ, ఈ గాసిప్‌పై అనసూయ ఏమంటుందో.!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?