Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

‘ఆనందం’లో తాప్సీకి వాటా?

‘ఆనందం’లో తాప్సీకి వాటా?

ఆనందో బ్రహ్మ. ఇటీవల ఏ హీరోయిన్ కూడా ఇంతలా ప్రమోషన్ చేసి వుండదు. ఆనందో బ్రహ్మకు హీరోయిన్ తాప్సీ అంతలా ప్రమోషన్ చేసింది. ఇంటర్వూలే, ఇంటర్వూలు. వీలయినంత వరకు మార్నింగ్ టు ఈవెనింగ్ 70 ఎమ్ ఎమ్ ఎంటర్ టైన్ మెంట్స్ సినిమా ఆపీసులోనే గడిపేసింది.

ప్రమోషన్ ను సుమారు రెండు వారాల పాటు నిర్వహించింది. కానీ తీరా చుస్తే సినిమాలో తాప్సీది మరీ కీలకమైన పాత్ర ఏమీ కాదు. ఈ పాత్ర తో, ఆ సినిమా హిట్ అయితే మరో ఒకటి రెండు సినిమాలు వస్తాయి, అందుకే ప్రమోషన్ అంతలా చేసింది అని అనుకోవడానికి.

అదీ కాక, హీరోయిన్ పాత్రలు చేసినపుడైనా నార్త్ హీరోయిన్ లు ఎవ్వరూ ప్రమోషన్ లో ఇంతలా మమేకం అవ్వరు. ఏమిటిదంతా? అని ఆరా తీస్తే, ఆనందో బ్రహ్మ సినిమాకు సంబంధించి, తాప్సీకి లాభాల్లో వాటా వుండే విధంగా ఒప్పందం కుదర్చుకుంది అని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆనందో బ్రహ్మ సినిమాను మూడు కోట్ల తక్కువ బడ్జెట్ లో తయారుచేసారు.

సీడెడ్, ఈస్ట్, వెస్ట్, కృష్ణ తప్ప మిగిలిన ఏరియాలు యువి క్రియేషన్స్, దిల్ రాజు సాయంతో నేరుగా విడుదల చేసుకున్నారు. మొత్తం మీద చిన్న సినిమాను బాగానే ప్రొజెక్ట్ చేసుకుని, మంచి లాభాలే చేసుకునేలా వున్నారు నిర్మాతలు. ఎందుకంటే శాటిలైట్ ఇంకా కాలేదు. మా టీవీ నుంచి మంచి ఆఫర్ నే వుందని వినికిడి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?