Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఆరు నూరైనా సంపత్ నందితోనే?

ఆరు నూరైనా సంపత్ నందితోనే?

గబ్బర్ సింగ్ 2,. ఇటీవలి కాలంలో ఇంతలా వార్తల్లో నలిగిన ప్రాజెక్టు ఇంకొకటి లేదేమో? ఈ ప్రాజెక్టు ఏ ముహుర్తాన అనుకున్నారో కానీ అలా డిలే అవుతూనే వస్తోంది. అలా అయిన కొద్దీ రకరకాల వార్తలు పుట్టుకొస్తూనే వున్నాయి. తాజా వార్త పవర్ దర్శకుడు బాబిని ఆ సినిమాకు డైరక్టర్ గా ఎంపికచేస్తున్నారని. అయితే ఇది కూడా ఫీలర్ లాంటిది అనే గుసగుసలు వినిపిస్తున్నాయి ఇండస్ట్రీలో. 

కోనవెంకట్, గోపీ మోహన్ లకు ఇప్పుడు డైరక్టర్లు కావాలి. వాళ్లకి నేరుగా దర్శకత్వ ఎవరూ అవకాశాలు ఇవ్వడం లేదు. అందుకోసం వాళ్లు ఎవరో ఒక డైరక్టర్ ను ముందుకు పెడుతున్నారని అంటున్నారు. తమ స్క్రిప్ట్ చరణ్ ఓకె చేయడంతో శ్రీవాస్ ను చరణ్ దగ్గరకు అలాగే తీసుకెళ్లారని, అయితే వర్కవుట్ కాలేదని తెలుస్తోంది. ఇప్పుడు బాబిని కొన్ని కార్డులు వాడి పవన్ దగ్గరకు చేర్చాలని ప్రయత్నిస్తున్నట్లు బోగట్టా. ఇలాంటి ఫీలర్లు వదలడంలో కోనవెంకట్ సిద్దహస్తుడని కూడా అంటున్నారు. 

మెగా హీరోలను రెండు బ్యాచ్ లుగా విడదీస్తే, పవన్ ఓ వైపు, మిగిలిన వారు మరో వైపు వుంటారు. ఇందులో చిరంజీవి బ్యాచ్ చాలా తెలివైనది,. ఎవరికి స్టామినా వుందో, ఎవరు చేయగలరో, ఎవరు చేయలేరో వాళ్లకి తెలుసు. అన్నీ చూసుకునే అవకాశం ఇస్తారు. అంతే కానీ అక్కర్లేని మొహమాటాలకు పోరు. ముఖ్యంగా అల్లు అరవింద్ అక్కడ పెద్ద చెక్ పాయింట్. 

ఇక పవన్ వ్యవహారం డిఫరెంట్. ఒకసారి మాట ఇస్తే ఆరు నూరైనా అది మాటే. అవసరైతే సంపత్ నందిని ముందు పెట్టి, తాను బండి నడుపుతాను కానీ, మార్చేది లేదని చెప్పినట్లు తెలుస్తోంది. పవర్ సినిమా తరువాత బాబికి ఇంకా అవకాశాలు రాలేదు. చేయడానికి హీరోలు కూడా ఖాళీగా లేరుఎవరూ? అందరూ రెండు మూడు ప్రాజెక్టులపై బిజీగా వున్నారు. చరణ్ మాత్రమే స్టార్ట్ చేయాల్సి వుంది.

ఎన్టీఆర్ గతంలో ఇలా హిట్ కోడితే అలా పట్టుకెళ్లి అవకాశం ఇచ్చేవాడు. ఇప్పుడు ఆ పద్దతి వదిలేసాడు. అందువల్ల బాబికి మిగిలింది పవన్ మాత్రమే,. అందుకే ఈ వార్తలు పుట్టాయని అంటున్నారు. పవన్-బాబిల మధ్య భేటీయే జరగలేదంటున్నారు. బాబీ-గబ్బర్ సింగ్ వార్త నిజమా..గతంలో హరీష్ ఫీలర్ లాంటిదేనా అన్నది ఒకటి రెండు రోజుల్లో తెలిసిపోతుంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?