Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఆయన దిగాలు పడ్డారు

ఆయన దిగాలు పడ్డారు

అవును ఎంతటి వాళ్లకైనా కోట్లు నష్టం అంటే కష్టమే. గత ఏడాది డిస్ట్రిబ్యూషన్ లో దాదాపు ముఫై కోట్లు పోగొట్టుకున్నారు దిల్ రాజు. కానీ నిర్మాతగా మాత్రం 6సక్సెస్ లు చవిచూసారు. నిర్మాణం కంపెనీ లాభాల్లో వుంది. పంపిణీ కంపెనీ నష్టాల్లో కూరుకుపోయింది. సరే 2018బాగుంటుంది అనుకుంటే మళ్లీ ఆరంభంలోనే చావు దెబ్బ తీసింది.

అజ్ఞాతవాసి ఇచ్చిన షాక్ కు నిర్మాత కమ్ డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు దిగాలు పడిపోయారని వినికిడి. ఎప్పుడూ హుషారుగా వుండే దిల్ రాజు ఇప్పుడు చాలా డల్ గా వున్నారని తెలుస్తోంది.

పెద్దగా ఎవ్వరితోనూ పలకరింపులు లేవని వినికిడి. సుమారు 23కోట్లకు (28 లేదా 29 అని వార్తలు వున్నాయి) అజ్ఞాతవాసి హక్కులు నైజాంకు కొన్నారు. ఇప్పుడు అందులో 13కోట్లు లాస్ అయ్యేలా వుంది.

పోనీ నిర్మాత ఇచ్చినా ఎంత ఇస్తారు? మహా అయితే అయిదు కోట్లు. అది కూడా ఇవ్వాలని రూలేం లేదు. కానీ ఇండస్ట్రీలో వున్న కట్టుబాటు, మోరల్ బైండింగ్ అలాంటది.  కానీ ఇంకా ఎనిమిది కోట్లు? అందుకే దిల్ రాజు చాలా డీలాగా వున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఆయన మరో డిస్ట్రిబ్యూషన్ సినిమా తొలిప్రేమ ఫిబ్రవరి మొదటి వారంలో వస్తోంది. ఆ సినిమాను అవుట్ రేట్ కు వరల్డ్ రైట్స్ దిల్ రాజు తీసుకున్నారు. మరి ఈ సినిమా ఏమన్నా దిల్ రాజు డిస్ట్రిబ్యూషన్ లక్ ను టర్న్ చేస్తుందేమో చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?