Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఆయన ఎందుకు గుర్తుకు రావడం లేదో?

ఆయన ఎందుకు గుర్తుకు రావడం లేదో?

నంది అవార్డుల మీద ఒకటే రచ్చ..చర్చ. మనం సినిమాకు ఇవ్వలేదు. రేసుగుర్రానికి ఇవ్వలేదు. అంతే తప్ప, అసలు రజనీ కాంత్, కమల్ హాసన్ లాంటి పక్క భాషా నటులకు ఎందుకు ఇచ్చారు. తెలుగు అవార్డులు, తెలుగు నటులు అర్హులైన వారు వున్నారా? లేరా? వాళ్లందరూ అయిపోయాక, పక్క రాష్ట్రానికి వెళ్లాలి కదా? అని అడగరేమి?

కమల్ కు, రజనీకాంత్ కు అవార్డు ఇచ్చే ముందు మన కైకాల సత్యనారాయణ ఎందుకు గుర్తుకురాలేదో? రఘుపతి అవార్డు కాంగ్రెస్ హయాంలో వచ్చింది ఆయనకు, ఎన్టీఆర్ ఇవ్వవచ్చు కదా ఇప్పుడు. ఎన్టీఆర్ తరువాత అంతటి మహానటుల జాబితాలో కైకాల సత్యనారాయణ తప్పకుండా వుంటారు. ఆయన చేయని పాత్రలు లేవు. పలికించని హావభావాలు లేవు. ఒకరికి రెండు అవార్డులు ఇవ్వకూడదన్న రూలూ లేదు. ఎందుకంటే ఈసారి జాబితాలోనే ఒకరికి రెండేసి అవార్డులు ఇచ్చారు కదా.

పైగా ఇప్పటి దాకా పాపం, కైకాలకు కేంద్రం నుంచి ఒక్క పురస్కారం లేదు. మనిషి వయో వృద్ధుడయిపోయారు. అలాంటి టైమ్ లో ఒక అవార్డు ఇస్తే ఆయన ఎంత ఆనందపడతారు? కనీసం ఆ ఆలోచన చేయలేదు ఎందుకనో? ఇక సీనియర్ నటీమణి జమున వున్నారు. ఈమెకు ఎన్టీఆర్ నేషనల్ అవార్డు మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు ఉన్న ప్రత్యేక అవార్డుల్లో ఏదో ఒకటి ఇవ్వవచ్చు కదా? ఆమె అర్హులే కదా?

సీనియర్ నిర్మాత కే.రాఘవ వున్నారు. తాతమనవడు నుంచి సినిమాలు తీసుకుంటూ వచ్చారు. ఎందరినో తెలుగు తెరకు పరిచయం చేసారు. అశ్వనీదత్ వున్నారు. ఎన్టీఆర్ టైమ్ నుంచి మహేష్ బాబు దాకా సినిమాలు నిర్మించిన సీనియర్ ప్రొడ్యూసర్. కోడి రామకృష్ణ వున్నారు. వందకు పైగా సినిమాలు అందించిన దర్శకుడు. ఆయనకు గతంలో రఘుపతి వెంకయ్య అవార్డు ఇచ్చారు. మళ్లీ ఏమీ లేదు.

బోయపాటి, త్రివిక్రమ్ లాంటి వాళ్లు గొప్పవాళ్లే కావచ్చు. కానీ వాళ్లు ఇప్పటికిప్పుడు ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోతున్నవాళ్లో, వయసు అయిపోయిన వాళ్లో అయితే కాదు. ఇంకా అనుభవం పండాల్సిన వాళ్లు. అందువల్ల వాళ్లకు ఈ ఏడాది కాకుంటే తరువాతి ఏడాది అయినా ఇవ్వవచ్చు. సీనియర్లలో ప్రతిభావంతులను సత్కరిస్తే అదో అందం. అంతే కానీ, వర్తమాన విజయాలను, ఇప్పటి చరిష్మాను మాత్రమే చూసుకుని అవార్డులు ప్రకటిస్తే ఎలా?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?