Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అదే జరిగితే ఎన్టీఆర్ సినిమా వుండదేమో?

అదే జరిగితే ఎన్టీఆర్ సినిమా వుండదేమో?

ఎన్టీఆర్ జీవిత చరిత్రను తెరకెక్కించాలని, తండ్రి పాత్రను బాలయ్య పోషించాలని కొంతమందికి చాలా ఉత్సాహంగా వుంది. వారి సలహా మేరకు బాలయ్య కూడా సై అన్నారని వినికిడి. సరే, ఆ సినిమా ఇంకా చాలా ఆరంభ దశలో వుంది.

అయితే అదే సమయంలో ఎన్టీఆర్ లాంటి లెజెండ్ చరిత్రను టచ్ చేయడం అనవసరం అని, ఎంత గొప్పగా చేసినా, ఎన్టీఆర్ సినిమాలు ఇంకా కళ్ల ముందే వున్నాయి కనుక, కంపారిజన్ వచ్చేసి, బాలయ్య కు నెగిటివ్ మార్కులు పడే ప్రమాదం వుందని గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి.

ఈ డైలమా ఇలా వుండగానే, ఇప్పుడు బయటకు వచ్చిన వార్త ఎన్టీఆర్ సినిమాను మరింత వెనక్కు నెట్టే అవకాశం కనిపిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ తన తాత ఎన్టీఆర్ పాత్రలో కనిపించబోతున్నారన్నది వార్త. 

మహానటి సావిత్రిపై నిర్మాత అశ్వనీదత్ తీస్తున్న సినిమాలో ఎన్టీఆర్ గా జూనియర్ కనిపించబోతున్నారన్నది ఆ వార్త సారాంశం. గతంలో ఓ సినిమాలో జూనియర్ కాస్సేపు జస్టిస్ చౌదరి మాదిరిగా కనిపించారు. అచ్చుగుద్దినట్లు వున్నారని ప్రశంసలు అందుకున్నారు.

ఇప్పుడు సావిత్రి సినిమాలో జూనియర్ నటించి, ఎన్టీఆర్ లా కనిపిస్తే కచ్చితంగా మంచి మార్కులు పడతాయి. అప్పుడు బాలయ్య తన ప్రాజెక్టుపై పునరాలోచించాల్సి వస్తుందేమో? లేదూ ఈ పాయింట్ ఆలోచించి, జూనియర్ నే సావిత్రి ప్రాజెక్టుకు దూరంగా వుంటారో?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?