Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అది నిజమేనా బోయపాటీ.!

అందరికీ తెల్సిన విషయమే, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడికి అత్యంత సన్నిహితుడు బోయపాటి. బహుశా, బాలకృష్ణ ద్వారా చంద్రబాబుతో సాన్నిహిత్యం ఏర్పడిందేమో.! కారణం ఏదైతేనేం, చంద్రబాబు తనకు ఎలాంటి ప్రమోషనల్‌ ఐడియాస్‌ కావాలన్నా ఠక్కున బోయపాటిని పిలిపించుకుంటుంటారట. అలా గోదావరి పుష్కరాల కోసం బోయపాటి డైరెక్షన్‌లోనే చంద్రబాబు నానా హంగామా చేశారు. ఆ హంగామానే, 29 మంది మృతికి కారణమయ్యిందనుకోండి.. అది వేరే విషయం. 

అయితే, ఆ హంగామాకీ, తనకూ, పుష్కరాల్లో జరిగిన తొక్కిసలాటకీ అసలు సంబంధమే లేదని ఆ తర్వాత బోయపాటి బుకాయించినా, బోయపాటి - చంద్రబాబు కాంబినేషన్‌ 29 మంది ప్రాణాలు తీసేసిందన్నది కాదనలేని వాస్తవం. ఇందులో బోయపాటి తప్పు ఎంత.? అన్నది పక్కన పెడితే, చంద్రబాబు పబ్లిసిటీ యావ అమాయకుల ప్రాణాల్ని బలిగొందన్నదాంట్లో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు. 

ఇప్పుడు కృష్ణా పుష్కరాలకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. మళ్ళీ బోయపాటి పేరు తెరపైకి వచ్చింది. చంద్రబాబు సర్కార్‌ బోయపాటిని సంప్రదించడం, 'గౌరవ రెమ్యునరేషన్‌' అందుకుని మరీ, బోయపాటి ఆ పనుల్ని పర్యవేక్షించడం.. ఇలా ప్రక్రియ అయితే నడుస్తోంది. కానీ, ఎక్కడా తన పేరు పైకి రాకుండా బోయపాటి 'సకల జాగ్రత్తలు' తీసుకుంటున్నాడట. బోయపాటికి రాష్ట్ర ప్రభుత్వం సమర్పించుకుంటున్న 'తాయిలం' చాలా ఎక్కువేనని సినీ, రాజకీయ వర్గాల్లో గుసగుసలు విన్పిస్తున్నాయి. 

చంద్రబాబు, బోయపాటి మర్చిపోయినా.. ఆనాటి ఆ దుర్ఘటనను ఎప్పటికీ బాధిత కుటుంబాలు మర్చిపోలేవు. మళ్ళీ ఆ కాంబినేషన్ రిపీట్ అవుతుండడం పట్ల ఆందోళన వ్యక్తమవుతుండడం సహజమే. చంద్రబాబు పబ్లసిటీ పిచ్చి ప్రాణాలు తీసేసింది.. సినిమాల్లో టేకింగ్ అదరహో అనిపించే బోయపాటి, చంద్రబాబుతో కలవడం డెత్ కాబినేషన్ అయి కూర్చుంది మరి. అదే ఇప్పుడు కృష్ణా పుష్కరాల భక్తులకు టెన్షన్.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?