Home > Movies - Movie Gossip
అదిగో బుల్లి పవర్ స్టార్.. ఇదిగో పేరు

అయిదు పదులకు దగ్గర పడుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నాణ్యంగా నాలుగోసారి తండ్రి అయ్యారు. ఈ వార్త ఎంత వేగంగా సోషల్ నెట్ వర్క్ లో వైరల్ అయిందో, ఆ బిడ్డకు క్రిష్టియన్ పేరు పెడతారన్న గ్యాసిప్ కూడా సోషల్ నెట్ వర్క్ లో వినిపించడం ప్రారంభమైంది. ఇప్పటికే వున్న ఆడబిడ్డకు అలాంటి పేరే వుంది. మరి దాన్ని బట్టే ఈ గ్యాసిప్ పుట్టిందని అనుకోవాలి. 

లేదూ అంటే తరచు పోలిటికల్ మీటింగ్ ల్లో పవన్ ఓ మాట చెబుతుంటారు. నాకు కులమతాలు లేవు. నా భార్య క్రిస్టియన్..అని ఆయన చాలా సార్లు అన్నారు. రాజకీయ పరిశీలకులు ఈ మాటను పవన్ కావాలని వాడుతున్నారని ఊహాగానాలు చేసారు. అదేంటంటే, తను అవునన్నా, కాదన్నా, వద్దన్నా కూడా కాపులు తన వెంట వుంటారు. 

పనిలో పనిగా జగన్ వెంట వున్నారనుకునే క్రిస్టియన్లను కూడా తన పక్కకు తిప్పుకోవడానికి పవన్ పదే పదే తన భార్య క్రిస్టియన్ అన్నది ప్రస్తావిస్తూ వుంటారు అని పరిశీలకుల భావన. లేదూ అంటే, తన భార్య క్రిస్టియన్ అనే బదులు, తన భార్య రష్యన్ అనో, ఆస్ట్రేలియన్ అనో చెప్పవచ్చుగా?

సరే మొత్తం మీద ఇప్పుడు ఈ క్రిస్టియన్ పేరు పెడతారు కుర్రాడికి అన్న పీలర్ కూడా కావాలనే బయటకు వదిలినట్లు కనిపిస్తోంది.