Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

వెంకీ ఖాతాలో మరో బాలీవుడ్ బ్యూటీ?

వెంకీ ఖాతాలో మరో బాలీవుడ్ బ్యూటీ?

వీలైనంత తక్కువ బడ్జెట్ లో వెంకటేష్ సినిమాను కంప్లీట్ చేయాలని చూస్తున్నాడు నిర్మాత సురేష్ బాబు. అందుకే కాస్త తక్కువ రెమ్యూనరేషన్ కు వచ్చే హీరోయిన్ కోసం వెదుకుతున్నారు. ఇందులో భాగంగా అదితిరావును సంప్రదించారు. ఈ సినిమాలో నటించేందుకు అదితి ఆల్ మోస్ట్ ఒప్పుకుందట.

తేజ దర్శకత్వంలో వెంకీ హీరోగా రాబోతున్న ఈ సినిమా కోసం గతంలో అనుష్క, కాజల్ లాంటి హీరోయిన్లను సంప్రదించారు. తర్వాత బడ్జెట్ కారణంగా వాళ్లను పక్కనపెట్టారు. తాజాగా అదితిరావు పేరు తెరపైకి వచ్చింది. ఆమె నెల రోజులు కాల్షీట్లు ఇస్తే చాలు. ఆమె పోర్షన్ మొత్తం కంప్లీట్ చేసే విధంగా ప్లాన్ చేశాడు తేజ.    

గతంలో మణిరత్నం తీసిన చెలియా సినిమాతో లైమ్ లైట్లోకి వచ్చింది అదితి. ప్రస్తుతం ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో సుధీర్ బాబు సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఈరోజు నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైంది. వెంకీ మూవీ ఓకే అయితే అదితి రావుకు అది రెండో తెలుగు సినిమా అవుతుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?