Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఆదిత్య 999 లైన్ ఓకె

ఆదిత్య 999 లైన్ ఓకె

మొత్తానికి ఈ వయస్సులో కూడా దిగ్దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మాంచి లైన్ చెప్పి బాలయ్య చేత ఓకె చేయించుకున్నారు. ఆదిత్య 369 కు సీక్వెల్ గా ఆయన ఎప్పటి నుంచో అంటున్న ఆదిత్య 999 కు సంబంధించిన లైన్ ను ఇటీవల బాలయ్యకు చెప్పారు. బాలయ్య ఓకె చేసారు. ఈ ఒక్క సినిమా చేసి, సుదీర్ఘమైన తన కెరీర్ కు ఇంక ఫుల్ స్టాప్ పెడతానని సింగీతం చెప్పినట్లు తెలిసింది. 

బాలయ్యకు లైన్ నచ్చడంతో, స్క్రిప్ట్ వర్క్ చేయమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారట. దాంతో ఇప్పుడు సింగీతం ఆ పని మీద వున్నారు. కానీ ఇప్పుడు బాలయ్య 99 వ సినిమా చేస్తున్నారు. మరి వందో సినిమాగా ఇది చేస్తారో లేదా, బోయపాటితో చేస్తారో తెలియదు. సింగీతంకు 101 వ సినిమా చాన్స్ అంటే అది కాస్త ఆలస్యం అయ్యే అవకాశం వుంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?