Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అదృష్టం కళ్యాణ్ దా? బాలయ్యదా?

అదృష్టం కళ్యాణ్ దా? బాలయ్యదా?

ఒక్కోసారి అంతే చిత్రాలు జరుగుతుంటాయి. ఇటీవలి కాలంలో అజ్ఞాతవాసి అంత హైప్, బజ్ తో వచ్చిన సినిమా లేదు. అలాగే జై సింహా అంతలో ప్రోఫైల్ తో వచ్చిన పెద్ద హీరో సినిమా లేదు. నిజానికి రెండింటికి పోలికలేదు. అది 150కోట్ల సినిమా. ఇది 40కోట్ల సినిమా. కానీ రెండూ సంక్రాంతికే విడుదలయ్యాయి.

ఇటీవలి కాలంలో బాలయ్య సినిమాలు లాభాలు సంపాదించేది తక్కువ. గౌతమీపుత్ర శాతకర్ణిని పక్కన పెడితే, ఆ తరువాత వచ్చిన పైసా వసూల్ నిర్మాతకు పెద్దగా లాభాలేమీ తేలేదు. బయ్యర్లకు కూడా. అంతకు ముందు వచ్చిన డిక్టేటర్ కూడా బ్రేక్ ఈవెన్ అయ్యిందా అంటే అనుమానమే. ఇంకా వెనక్కు వెళితే, లయన్, శ్రీమన్నారాయణ ఇలా లిస్ట్ చాలానే వుంది.

అలాంటిది జై సింహా సినిమా బ్రేక్ ఈవెన్ అవుతోంది. సినిమాను ఎక్కడా అమ్మలేదు. అమ్మలేదు అనేకన్నా, అడిగిన రేట్లు రాలేదు. నేరుగా విడుదల చేసారు. సినిమాకు బడ్జెట్ 35కోట్లు అన్నది నిర్మాత మాట. కాదు 30నే అని ఇండస్ట్రీ గుసగుస. శాటిలైట్, డిజిటల్ వగైరా దగ్గర దగ్గర 12కు పైగా వచ్చింది. ఇప్పుడు ఆరురోజులు వరల్డ్ వైడ్ షేర్ 25వరకు వచ్చింది.

ఇది నిర్మాత సి కళ్యాణ్ అదృష్టం అనుకోవాలి. పండగకు వచ్చిన పెద్ద, చిన్న సినిమాలు ఆకట్టుకోలేని టైమ్ లో, జస్ట్ ఓ రెగ్యులర్ ఫార్మాట్, కమర్షియల్ సినిమా తీసి, గోల్ కొట్టారు దర్శకుడు రవికుమార్.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?