Advertisement


Home > Movies - Movie Gossip
పవన్ తో మరో సినిమా?

మరి 20కోట్లు రెమ్యూనిరేషన్ గా తీసుకున్న పవన్, అంతే తీసుకున్న త్రివిక్రమ్ ల బాధ్యత ఏమిటి? త్రివిక్రమ్ అంటే హారిక హాసినికి వరుసగా సినిమాలు చేస్తారు. అందువల్ల అక్కడ లెక్కలు చూసుకుంటారు.

కానీ పవన్? ఇండస్ట్రీలో ఏ హీరో కూడా రూపాయి వెనక్కు ఇవ్వడం అన్నది వట్టి మాట. కావాలని తమ జనాలతో అలా ఫీలర్లు వదిలిస్తారు తప్ప, ఇచ్చిన దాఖలాలు ఇప్పటి దాకా అయితే లేవు. కావలంటే ఓ సినిమా చేస్తాం అని మాట ఇస్తారు. చేస్తారా? చేయరా అన్నది మళ్లీ డవుట్ నే. బ్రహ్మోత్సవం టైమ్ లో అలాగే మాట ఇచ్చారు మహేష్. ఏమయింది?

కానీ అజ్ఞాతవాసి విషయంలో పవన్ ను నిర్మాత చినబాబు అడిగినట్లు, ఆయన తప్పకుండా మరో సినిమా చేస్తానని మాట ఇచ్చినట్లు తెలుస్తోంది. పవన్ గతంలో సర్దార్ గబ్బర్ సింగ్ కోసం నిర్మాత శరత్ మరార్ కు కాటమరాయుడు చేసారు. పవన్-త్రివిక్రమ్ జోడీ మళ్లీ తమ హిట్ ట్రాక్ ను నిరూపించడం కోసం అయినా మళ్లీ సినిమా చేస్తారు. అది పక్కా. అయితే అది ఎన్టీఆర్, వెంకీ సినిమాల తరువాతే కావచ్చు.