Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అజ్ఞాతవాసి ఛలో కాశీ

అజ్ఞాతవాసి ఛలో కాశీ

పవన్ కళ్యాణ్ సినిమా మరోసారి కాశీలో షూటింగ్ జరుపుకోబోతోంది. గతంలో ఆయన నటించిన గోపాల గోపాల కొన్ని సన్నివేశాలు కాశీలో షూట్ చేసారు. కానీ ఆ సన్నివేశాలలలో పవన్ లేరు. కానీ ఈసారి మాత్రం పవన్ అజ్ఞాతవాసి సినిమా షూటింగ్ కాశీ, ప్రయాగ, అలహాబాద్ ల్లో వారం పైగానే షూటింగ్ జరుపుకోబోతోంది. 

అజ్ఙాతవాసి సినిమా విదేశీ షెడ్యూలు ముగిసింది. కానీ మరో షెడ్యూలు వుంది. అది కాశీ, ప్రయాగ, అలహా బాద్ ల్లో జరుగుతుంది. ఒక్కో చొట ఒకటి లేదా రెండు రోజులు మాత్రమే షూట్ వుంటుంది. ఈ నెల 25తరువాత నుంచి వారం రోజుల పాట ఈ షెడ్యూలు వుంటుంది. డిసెబర్ ఫస్ట్ వీక్ తో సినిమా టోటల్ టాకీ పూర్తవుతుంది. అక్కడి నుంచి ఇక పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. 

ఈనెల టైటిల్ వచ్చేనెల అడియో

ఈ నెల మూడో వారంలోగా టైటిల్ ను ప్రకటిస్తారు. పవన్ విదేశాల నుంచి వచ్చిన తరువాత కాశీ షెడ్యూలు ప్రారంభమయ్యే లోగానే టైటిల్ ప్రకటన వుండొచ్చు. 99శాతం అజ్ఙాతవాసి నే టైటిల్. ఆఖరి నిమిషంలో త్రివిక్రమ్ కు మరేదైనా అద్భుతమైన టైటిల్ దొరికితే తప్ప మార్పు వుండదని తెలుస్తోంది. 

ఇదిలా వుంటే వచ్చే నెల రెండో వారంలో అడియో ఫంక్షన్ వుంటుంది. అయితే, ఎక్కడ ఎలా చేయాలన్న దానిపై కిందా మీదా అవుతున్నారు. పెద్ద ఆడిటోరియం లేదా మైదానంలో చేయాలని వుంది. కానీ కుర్చీలు వేస్తే అదో సమస్య. పవన్ కేవలం నటుడు మాత్రమే కాదు. రాజకీయ నాయకుడు కూడా. అందువల్ల ఏదైనా అనుకోని గొడవలు తలెత్తితే కుర్చీలే ఆయుధాలయిపోతాయి.

పోనీ ఇండోర్ ఆడిటోరియంలో చేద్దాం అంటే ఎక్కువ మంది జనం పట్టరు. లిమిటెడ్ గ్యాదరింగ్ తో చేయాలి అంటే ఫ్యాన్స్ తో సమస్య. అందుకే పవన్ విదేశాల నుంచి వచ్చాక దీనిపై చర్చించాలని డిసైడ్ అయి, నిర్ణయం పక్కన పెట్టారు.

విదేశాల్లో భారీ ఫైట్లు

విదేశీ షెడ్యూలులో భారీ యాక్షన్ సీన్లు కూడా తీసారు. కార్లు పల్టీ కొట్టడం వంటి సన్నివేశాలు అక్కడి లోకల్ నిపుణులతో చాలా రియలిస్టిక్ గా తీసారు. తెలుగు తెరపై ఇలాంటి సన్నివేశాలు ఇదే తొలిసారి అనేంత బాగా వచ్చాయని యూనిట్ వర్గాల బోగట్టా. అందువల్లే అనుకున్నదానికన్నా కాస్త అదనంగా ఖర్చయిందని తెలుస్తోంది. 

బాహుబలి తరువాత ఇదే

తెలుగు సినిమాల్లో బాహుబలి తరువాత అంత భారీగా ఖర్చు చేసిన సినిమాగా అజ్ఞాతవాసి ఓ రికార్డును అప్పుడే స్వంతం చేసుకుంది. 120కోట్లకు పైగానే అజ్ఞాతవాసి కోసం ఖర్చయినట్లు తెలుస్తోంది. స్పైడర్ సినిమాతో పోల్చుకుంటే కాస్త ఎక్కువే. సినిమా మార్కెట్ కూడా ఎక్కువే. 150కోట్ల మేరకు అమ్మకపు ఒప్పందాలు జరిగినట్లు తెలుస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?