Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అఖిల్ సినిమా టైటిల్ ‘హలో’?

అఖిల్ సినిమా టైటిల్ ‘హలో’?

అఖిల్ సినిమా టైటిల్ సస్పెన్స్ మెలమెల్లగా విడిపోతోంది. నిన్నటికి  నిన్న నాగ్ ఓ పాట ట్వీట్ చేసి, అందులో అఖిల్ సినిమా టైటిల్ వుందన్నాడు. హలో గురూ ప్రేమ కోసమేనోయ్ జీవితం అనే పాట అది.

మరో క్లూను ఇవ్వాళ నాగా చైతన్య వదిలాడు. ఇది నాగా చైతన్య పాట. సమంత-చైతూల సూపర్ హిట్ సినిమా ఏమాయ చేసావేలో పాటను చైతూ ట్వీట్ చేసాడు. ఆ పాటలో కూడా హలో పదం వుంది. పైగా ఆ ఒక్క పదం మాత్రమే రెండు పాటల్లో కామన్ వర్డ్.

పైగా ట్విట్టర్ ఫాలోవర్స్ అంతా, నో సెకెండ్ థాట్, హల్లో అన్నదే టైటిల్ అని పిక్స్ గా రెస్పాన్స్ ఇచ్చేసారు. దీన్ని బట్టి అదే టైటిల్ అని అనుకోవాల్సి వస్తోంది. ఇంకో క్లూ ఇస్తానన్న నాగ్, ఆ క్లూ ను చైతూ ఇస్తాడని కూడా వెల్లడించాడు. అందువల్ల ఇదే ఆ క్లూ అనుకోవాలి.

సో, అఖిల్ – విక్రమ్ కుమార్ ల  సినిమా టైటిల్ మీద క్లారిటీ వచ్చేసినట్లే. హలో..లేదా హల్లో..బాగానే వుంది 13బి, ఇష్క్, మనం, 24 వంటి విక్రమ్ కుమార్ రెండు అక్షరాల టైటిళ్ల సరసన ఇది కూడా చేరుతుంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?