Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అఖిల్ విరగదీసాడట

అఖిల్ విరగదీసాడట

అక్కినేని అఖిల్..ఆ కుటుంబానికే ఓ కొత్త మాస్, హెవీ ఇమేజ్ తెచ్చే దిశగా వెళ్తున్న నటుడు. హీరో నితిన్ నిర్మిస్తున్న అఖిల్ సినిమాలో హీరో అతగాడే. ఈ సినిమాపై మంచి అంచనాలు వున్నాయి. ఇప్పటికే మంచి బిజినెస్ చేసుకుందీ సినిమా.

తాజా బజ్ ఏమిటంటే, ఓ నిర్మాత ఎడిటింగ్ రూమ్ లో అఖిల్ సినిమా పాటలు, ఫైట్లు చూసాడట. చూసి ఫిదా అయిపోయాడట. 'ఏం విరగదీసాడు..డైరక్ట్ గా ఒక్క సినిమాతోనే సూపర్ స్టార్ అయిపోయేలా వున్నాడు' అని కామెంట్ చేసాడా నిర్మాత.

అఖిల్ ఫెర్ ఫార్మెన్స్ చాలా స్టయిలిష్ గా వుందట. వినాయక్ టేకింగ్ కూడా కొత్తగా కనిపించిందని అంటున్నారు. ఈ సినిమా దసరాకు జనాల ముందుకు వస్తోంది.ఈ సినిమా హిట్ అయి, అఖిల్ మాస్ హీరో అయిపోతే, యాభై కోట్ల క్లబ్, డెభై కోట్ల క్లబ్ అనేవి అక్కినేని ఫ్యామిలీకి కూడా అందుబాటులోకి వస్తాయి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?