Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఆల్ మోస్ట్ కీరవాణి సింగిల్ కార్డ్

ఆల్ మోస్ట్ కీరవాణి సింగిల్ కార్డ్

సంగీత దర్శకుడు కీరవాణి మల్టీ టాలెంటెడ్. పాటలు పాడతారు. రాస్తారు కూడా. అప్పుడెప్పుడో పత్రికల్లో వచ్చే వార్తల శీర్షికలు, వాటిల్లో వాడే పదాలతో ఓ పాట రాసారు సరదాగా. అప్పటి నుంచీ అడపా దడపా చేయి చేసుకుంటూనే వున్నారు. ఇక కీరవాణి తండ్రి శివదత్త, కచ్చితంగా ఓ పాట అయినా రాస్తారు కొడుకు సంగీతం అందించే సినిమాలకు.

ఇప్పుడు బాహుబలి 2 సినిమా కోసం కీరవాణి ఏకంగా మూడు పాటలు రాసేసారు. సినిమాలో వున్నవే అయిదు ట్రాక్ లు. వాటిల్లో ఒకటి కీరవాణి తండ్రి శివదత్త రాసారు. మూడు కీరవాణి రాయగా, ఒకటి చైతన్య ప్రసాద్ రాసారు. బాహుబలి 2 ట్రాక్ లిస్ట్ ను బయటకు వదిలారు. ఈ లిస్ట్ చూస్తుంటే పార్ట్ 2 లో ఒక్కటే డ్యూయట్ వున్నట్లు అనిపిస్తోంది. ఫస్ట్ పార్ట్ లో వున్నట్లు అయిటమ్ సాంగ్ ల్లాంటివి ఏదీ లేదు.

సాహోరే బాహుబలి అన్నది థీమ్ సాంగ్, ప్లస్ ఇంట్రడక్షన్ సాంగ్ వుంది. కన్నా నిదురించరా అన్నది చిన్న బాహుబలికి జోలపాట కావచ్చు. దండాలయ్యా అనేది జనాలు హీరోకు పట్టే నీరాజనం అనుకోవాలి.

ఇక కీలకంగా వుండే బాహుబలి మరణం సందర్భంలో నేపథ్యంలో వచ్చే పాటలా వుంది..ఒక ప్రాణం అంటూ సాగే పాట.

ఇవి కాక హంస నావ అనే పాట వుంది. అది ఒక్కటే డ్యూయట్ కావచ్చు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?