Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అల్లరి నరేష్ 50వ సినిమా అదేనా?

అల్లరి నరేష్ 50వ సినిమా అదేనా?

ఈ జనరేషన్ హీరోల్లో అత్యంత వేగంగా యాభై సినిమాలు చేసేసాడు అల్లరి నరేష్. యాభయ్యవ సినిమాను ప్రెస్టజియస్ గా చేయాలా? దాన్ని కూడా అన్ని సినిమాల్లో ఓసినిమాగా చేయాలా అన్నదానిపై సందిగ్ధంగా వున్నాడు. గతంలో అందరూ ఇదే ప్రశ్న అడిగితే, అదేమంత ప్రత్యేకంగా ఫీల్ కావడం లేదని బదులిచ్చాడు. 

ఇటీవల నరేష్ సినిమాలతో పోల్చుకుంటే జేమ్స్ బాండ్ రిజల్ట్ మరీ అంత బ్యాడ్ గా లేదు. సినిమాకు క్రెడిట్స్ ఎలా వున్నా, కలెక్షన్లు దాని ఖర్చును గట్టెక్కించాయి. దాంతో నరేష్ కాస్త ఊపిరి పీల్చుకున్నాడు. ఇప్పుడు యాభయ్య సినిమా గురించి ఆలోచిస్తున్నాడు. 

కలెక్షన్ కింగ్ మోహన్ బాబుతో కలిసి చేస్తున్న సినిమాను 50వ సినిమాగా చేయాలా? లేక అది పూర్తయ్యేలోగా యాభయ్యవ గా మరోటి ఏదైనా చేయాలా అని ఆలోచన ప్రారంభించాడట. మంచి డైరక్టర్, మంచి సబ్జెక్ట్ కుదిరితే చేయాలనే అనుకుంటున్నాడట.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?