Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అల్లు అర్జున్‌కి నచ్చలేదంట

అల్లు అర్జున్‌కి నచ్చలేదంట

‘రేసుగుర్రం’తో అల్లు అర్జున్‌ ఎంతటి విజయం సాధించాడనేది తెలిసిందే. ఇలాంటి హిట్‌ తర్వాత ఏ హీరో అయినా కానీ వెంటనే మరో సూపర్‌ ఎంటర్‌టైనర్‌ చేయాలని అనుకుంటాడు. లక్కీగా అలాంటి ప్రాజెక్ట్‌ బన్నీకి ముందే సెట్‌ అయిపోయింది కూడా. అత్తారింటికి దారేది చిత్రంతో ఇండస్ట్రీ హిట్‌ ఇచ్చిన త్రివిక్రమ్‌ తన తదుపరి చిత్రాన్ని ఏరి కోరి అల్లు అర్జున్‌తో చేద్దామనుకున్నాడు. 

ఆ సినిమా ఖరారైన తర్వాత కూడా దాని కంటే ముందు అల్లు అర్జున్‌ ‘రుద్రమదేవి’లో ప్రత్యేక పాత్ర చేయడానికి అంగీకరించి షాకిచ్చాడు. త్రివిక్రమ్‌ సినిమా చేసుకోకుండా ఈ టైమ్‌లో స్పెషల్‌ రోల్స్‌ ఎందుకని ఫాన్స్‌ కూడా ఒకింత ఫీలవుతున్నారు. ఇదిలావుంటే అల్లు అర్జున్‌ వేరే కథలు వింటున్నాడని కూడా తరచుగా వార్తల్లో వినిపిస్తోంది. 

త్రివిక్రమ్‌ సినిమా మొదలు పెట్టకుండా మరొకరి కథలు వినాల్సిన అవసరమేంటి? ఆరా తీస్తే త్రివిక్రమ్‌ చెప్పిన కథ అల్లు అర్జున్‌కి నచ్చలేదట. దానిని మార్చమని అతను అడిగితే ఇంతవరకు త్రివిక్రమ్‌ మరో వెర్షన్‌ కూడా వినిపించలేదట. ఆలస్యం అవుతోందని అల్లు అర్జున్‌ రుద్రమదేవి చిత్రాన్ని చేస్తూ వేరే కథలు కూడా వింటున్నాడట. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?