Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అల్లుడి శీను...ఓ భారీ ఉచిత ప్రదర్శన?

అల్లుడి శీను...ఓ భారీ ఉచిత ప్రదర్శన?

ఒక హీరోను టాలీవుడ్ లో ప్రవేశపెట్టాలంటే ఇంత ఖర్చు కావాలా? అల్లుడి శ్రీను వ్యవహారాలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. 

భారీ చిత్రాల నిర్మాత బెల్లంకొండ సురేష్ తన రెండో కుమారుడు సాయి శ్రీనివాస్ ను తెలుగుతెరకు హీరోగా పరిచయం చేయడం కోసం చాలా భారీ ప్రయత్నమే చేస్తున్నారు. ఇందుకోసం ఆయన చేస్తున్న ఖర్చు అక్షరాలా 42కోట్లు అని తెలుస్తోంది. ఇందులో ప్రచారం కోసమే ఏడు కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లు అంచనా. మాటీవీ, జీ టీవీ, జెమినీ టీవీలకే ఒక్కోదానికీ రమారమీ కోటి రూపాయిల వంతున ప్రచార బిల్లులు చెల్లించినట్లు తెలుస్తోంది. ఇక మిగిలిన ప్రచారానికి లెక్కేలేదు. 

42 కోట్ల ఖర్చంటే మాటలు కాదు. బాలకృష్ణ లెజెండ్ సినిమాకు అయిన ఖర్చు. అంత పెద్ద హిట్ సినిమా కూడా ఆ మేరకు తిరిగి రాబట్టుకోవడం చాలా కష్టమైంది. మరి ఓ కొత్త హీరో సినిమా, ఎంత వినాయక్ లాంటి దర్శకుడైనా రాబట్టుకోగలదా అన్నది పెద్ద ప్రశ్న,.అనుభవం కలిగిన నిర్మాత బెల్లంకొండకు ఈ సంగతి తెలియంది కాదు..కానీ కొడుకును హీరోగా నిలబెట్టాలన్న తాపత్రయంతో ఆయన అంచనాలకు మించి ముందుకు వెళ్లిపోయారు అనుకోవాలి. ఇప్పుడు వినాయక్ పేరు, పబ్లిసిటీతో ఓపెనింగ్స్ బాగానే వుంటాయి. ఆపైన ఏ మాత్రం బాగున్నా, వన్ వీక్ కలెక్షన్లు ఓకె. అంటే పది నుంచి 15 కోట్ల వరకు ఢోకా లేదు. ఆపైన మంచి టాక్ వస్తే మరో అంతకు అంతా రావచ్చు. కానీ 42 కోట్ల మేరకు అంటే కాస్త కష్టమైన సంగతే. సినిమా అద్భుతంగా వుండాల్సి వుంటుంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?