Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అమితాబ్ ను ఎలా ఒప్పించారంటే..?

అమితాబ్ ను ఎలా ఒప్పించారంటే..?

మెగాస్టార్ సై..రా సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ కీలకమైన పాత్ర పోషిస్తున్న విషయం, అది ఏ పాత్ర అన్న విషయం బయటకు వచ్చేసింది. కానీ బాలయ్య-కృష్ణవంశీ కాంబినేషన్ సినిమాలో చేసేందుకు నో అన్న అమితాబ్, సైరా సినిమాకు మాత్రం ఎందుకు ఊ అన్నారన్నది ప్రశ్న. 

బాలయ్య సినిమాకు ఎందుకు నో అన్నారన్నది అందరికీ తెలియకపోయినా, ఇండస్ట్రీలోని కీలకమైన చిరంజీవి లాంటి వాళ్లకు తెలియంది కాదు. సో, అక్కడ ఆన్సరు తెలిసిపోయింది కాబట్టి లెక్క చేసేయడం సులువు అయింది. 

క్లియర్ గా చెప్పాలంటే, ఇండస్ట్రీ ఇన్ సైడ్ సర్కిళ్లలో వినిపించే విషయాల్లోకి వెళ్లాలి. సాక్షి రామ్ రెడ్డి కథతో కృష్ణవంశీ-బాలయ్య కాంబినేషన్ లో రైతు సినిమా తీయాలనుకున్నపుడు అమితాబ్ ను కలిసారు. ఎందుకోసం, అందులో వున్న రాష్ట్రపతి క్యారెక్టర్ ను పోషించమని అడగడానికి. కానీ ఆ క్యారెక్టర్ నిడివి జస్ట్ నిమషంన్నర మాత్రమే అని బోగట్టా. 

అంతావిన్న అమితాబ్, తనకు ఎన్టీఆర్ తో వున్న అనుబంధం గుర్తుచేసుకుని, ఎన్టీఆర్ లాంటి మహా నటుడిని ఇలాంటి నిమషంన్నర క్యారెక్టర్ చేయమని ఎవరైనా అడిగితే ఎలా వుంటుంది అనే అర్థం వచ్చేలా మాట్లాడారని తెలుస్తోంది. కావాలంటే పాత్ర నిడివి పెంచుతాం అని కృష్ణవంశీ చెప్పినా, ఇక ఇప్పడు పెంచడం కథకు బాగుండదని అమితాబ్ సున్నితంగా తిరస్కరించినట్లు బోగట్టా. ఆ విధంగా ఆ ప్రయత్నం విఫలమైంది. 

సో, నిడివి తక్కువ వల్ల అమితాబ్ చేయలేదని అర్థమైన చిరు అండ్ కోసం అమితాబ్ కాదనలేని విధంగా క్యారెక్టర్ తయారు చేసారు. నిజానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథలో ఆయన గురువు పాత్ర చాలా చిన్నది. కానీ ముందుగానే అమితాబ్ ను దృష్టిలో పెట్టుకుని, గురువు పాత్ర నిడివిని వీలయినంత పెంచారు. అయితే ఆ పాత్ర కూడా సినిమా తొలిసగంలో రాదు. మలి సగంలో మాత్రమే వస్తుంది. కానీ చెప్పుకోదగ్గ పాత్ర. దాంతో ఇక అమితాబ్ కాదని అనడానికి లేకపోయింది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?