Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అమ్మో..రీతూ వర్మ?

అమ్మో..రీతూ వర్మ?

ఒక్క సినిమా హిట్ అయితే చాలు హీరోయిన్ల రేటు సర్రున పెరిగిపోతుంది. హీరోయిన్ రీతూ వర్మ వ్యవహారం ఇలాగే వుందని తెలుస్తోంది. ఈ పెళ్లి చూపుల పిల్ల ఆ సినిమాకు ముందు పెద్దగా ఎవరికీ తెలియదు. అప్పుడు అడవిశేష్ తో అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ లో ఓ సినిమాకు అగ్రిమెంట్ చేసుకుంది. అది కూడా 11 లక్షలకు. ఓ కొత్త హీరోయిన్ కు ఆ అమౌంట్ అంటే కరెక్టే. 

సరే, తీరా పెళ్లి చూపులు వచ్చింది. పెద్ద హిట్ అయిపోయింది. దీంతో ఆమెకు అడవి శేష్ చిన్న హీరోలా కనిపించాడు. అడవి శేష్ తోనా..సారీ నో..అని అనేసినట్లు తెలుస్తోంది. దాంతో అవాక్కయిన అభిషేక్ పిక్చర్స్ వాళ్లు, సరే మాదే నిఖిల్-సుధీర్ వర్మ ప్రాజెక్టు కూడా వుంది. ఆ సినిమా చేసుకోండి అయితే అన్నారని వినికిడి. 

అయితే ఓకె కానీ, నిఖిల్ అంటే కాస్త మంచి హీరోనే. అందువల్ల ఈ 11 లక్షల రెమ్యూనిరేషన్ చాలదు. కనీసం 15 లక్షలకు పైన అయితేనే చేస్తాను అంటోందట. సేమ్ బ్యానర్, సేమ ప్రొడక్షన్, అగ్రిమెంట్ వుంది, ఇలా మాట్లాడ్డం ఏమిటి? ఒక్క సినిమా హిట్ కాగానే అని తల పట్టుకుంటున్నారట అభిషేక్ జనాలు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?