Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అనీషాకు పవన్ స్పెషల్ ట్రయినింగ్

అనీషాకు పవన్ స్పెషల్ ట్రయినింగ్

గబ్బర్ సింగ్ 2 కు హీరోయిన్ గా ఎంపికై అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది అనీషా అంబ్రోస్. అసలు హీరోయిన్ ఎంపిక కారణంగానే ఆది నుంచి గబ్బర్ సింగ్ 2 ఆలస్యమైన సంగతి తెలిసిందే. తీరా అనీషాను ఎంపిక చేసినా కూడా సెట్ మీదకు వెళ్లలేదు. జనవరి నుంచి నెలలు గడుస్తూనే వున్నాయి. 

అయితే ఇప్పుడు మరో ఆసక్తికరమై సంగతి బయటకు వచ్చింది. గబ్బర్ సింగ్ 2 తాజా డైరకర్ట్ రవీంద్ర (బాబి), హీరోయిన్ అనీషా అంబ్రోస్ కు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాడట. నటన, డ్యాన్స్ లు ఇంకా అనేక ఇతర విషయాల్లో అనీషాకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారట. ఒక విధంగా ఇది అనీషాకు ఏక్టింగ్ వర్క్ షాప్ లాంటిదన్నమాట. నిజానికి అనీషాకు ఇది తొలి సినిమా ఏమీ కాదు. తెలుగు, కన్నడ సినిమాల్లో నటించింది. 

కానీ గబ్బర్ సింగ్ 2 సినిమా అనీషాకు అన్ని విధాలా మంచి సినిమా కావాలని, ఆమె కెరీర్ టర్న్ తీసుకోవాలని పవన్ ఈ శ్రద్ధ తీసుకుంటున్నారని వినికిడి. దీని గురించి ఎక్కడా పెదవి విప్పవద్దని అనీషాకు ముందే స్ట్రిక్ట్ గా చెప్పారట.  గబ్బర్ సింగ్ 2 స్టోరీ లైన్ ను పవన్ కళ్యాణ్ స్వయంగా తయారు చేసిన సంగతి తెలిసిందే. అందులో హీరోయిన్ కు కూడా మాంచి ప్రాధాన్యత వుండేలా డిజైన్ చేసారట. దాంట్లో చాలా షేడ్ లు వున్నాయట. 

అలాంటి పాత్రకు పెద్ద పెద్ద హీరోయిన్లను కాదని, ఓ అప్ కమింగ్ హీరోయిన్ ను తీసుకోవడం అన్నది రాంగ్ అన్న మాట రేపు సినిమా విడుదలయ్యాక రాకూడదు అన్నది పవన్ ఆలోచనగా తెలుస్తోంది. అందుకే అన్ని విధాలా అనీషాకు శిక్షణ ఇచ్చే బాధ్యతను డైరక్టర్ రవీంద్ర మీద వుంచాడట. తాను కూడా అప్పుడప్పుడు పర్యవేక్షిస్తున్నాడని వినికిడి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?