Home > Movies - Movie Gossip
కొత్త సినిమాపై మరోసారి క్లారిటీ

అనిల్ రావిపూడి నెక్ట్స్ సినిమాపై రోజుకో పుకారు షికారు చేస్తోంది. మల్టీస్టారర్ గా రాబోతున్న ఈ ప్రాజెక్టులో వెంకటేష్ హీరోగా నటించడానికి ఒప్పుకున్నాడని, దిల్ రాజు బ్యానర్ పై త్వరలోనే సెట్స్ పైకి రానున్న ఈ సినిమాకు ఎఫ్-2 అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు ఈమధ్య వార్తలు వచ్చాయి. వీటిపై ఇప్పటికే క్లారిటీ ఇచ్చిన రావిపూడి, తాజాగా తన సినిమాపై వచ్చిన మరో రూమర్ పై కూడా స్పందించాడు.

ఈ మల్టీస్టారర్ మూవీలో వెంకటేష్ తో పాటు సాయిధరమ్ తేజ్ హీరోగా నటించబోతున్నాడనేదే ఆ పుకారు. ఈ వార్తను అనిల్ రావిపూడి ఖండిస్తున్నాడు. తన కొత్త సినిమాకు సంబంధించి ఇప్పటివరకు ఏ హీరోను ఫైనలైజ్ చేయలేదని, కొన్ని రోజులు ఆగిన తర్వాత తనే స్వయంగా ప్రకటిస్తానని అంటున్నాడు.

ప్రస్తుతానికైతే ఈ ప్రాజెక్టుకు సంబంధించి వెంకీ, సాయిధరమ్ తేజ్ అఫీషియల్ గా ఇంకా పక్కా కాలేదంటున్నాడు అనిల్. సినిమా మాత్రం దిల్ రాజు బ్యానర్ పైనే ఉంటుందని, ఎఫ్-2 అనేది వర్కింగ్ టైటిల్ మాత్రమేనని స్పష్టంచేశాడు.