Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అనిరుధ్ కు పిచ్చ పబ్లిసిటీ

అనిరుధ్ కు పిచ్చ పబ్లిసిటీ

శివుని ఆన లేనిదే చీమైనా కుట్టదు. హారిక హాసినిలో త్రివిక్రమ్ తలపు లేనిదే ఏదీ జరగదు. అందుకే ఇప్పుడు ఓ విషయం టాలీవుడ్ లో డిస్కషన్ పాయింట్ అయింది. అదే మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కు ఇస్తున్న ప్రచారం. అనిరుధ్ తమిళ్ లో మాంచి పేరున్న మ్యూజిక్ డైరెక్టర్ నే. అందులో సందేహం లేదు.

తెలుగులో ఓ పెద్ద సినిమా ఆడియో వస్తున్నపుడు మ్యూజిక్ డైరెక్టర్ పిక్5హోబో పోస్టర్ వదలడం కూడా కామన్ నే. కానీ అనిరుధ్ విషయంలో అంతకు వంద ఇంతలు జరుగుతోంది. ఆజ్ఞతవాసి మొదటి సాంగ్ విడుదల అయినపుడే ఆనిరుధ్ హంగామా స్టార్ట్ అయింది. హోటల్ రూమ్ లో అనిరుధ్.. త్రివిక్రమ్ జంటగా హల్ చల్ చేస్తున్న వీడియోతో ఆ పాట బయటకు వచ్చింది.

ఆ పాట విడుదల సంగతి ముందుగా ప్రకటించింది కూడా ఆనిరుధ్ నే. తరువాత ఇన్ని రోజుల తరువాత నెక్స్ట్ పాట గురించి హంగామా కూడా అనిరుధ్ నే స్టార్ట్ చేసాడు. పాట ప్రకటన డేట్ పోస్టర్ ఎప్పుడు వస్తుందో.. ఆ తరువాత అసలు హంగామా మొదలయ్యింది. వెనుక పవన్ పోస్టర్.. అదే పోజ్ లో ముందు అనిరుధ్.. అలా అని ఒక పోస్టర్ కాదు.. రోజుకు ఒకటి.. వంతున.

తెలియని వాళ్ళు చూస్తే పొరపాటున అనిరుధ్ నే హీరో అనుకునే రేంజ్ లో హడావుడి జరుగుతోంది. దీని వెనుక త్రివిక్రమ్ ప్లాన్ ఏదో ఉండే ఉంటుంది. కొంపదీసి ఆనిరుధ్ ను హీరో ను చేసి రెండు భాషల్లో ఓ సినిమా తీసే ఐడియా ఏమి లేదు కదా.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?